నర్సాపూర్ లో సీఎం కేసీఆర్ హరితహారం

192
cm kcr
- Advertisement -

ఆరో విడత హరితహారం కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌ గురువారం మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ లో శ్రీకారం చుట్టనున్నారు. అర్బన్‌ ఫారెస్ట్ పార్కులో మొక్కలు నాటి, హరిత హార కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో బుధవారం మంత్రులు ఇంద్రకరణ్, హరీష్ రావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి, పీసీసీఎఫ్ స్వర్గం శ్రీనివాస్, కలెక్టర్‌ ధర్మారెడ్డి, ఎస్పీ , డీఎఫ్ఓలు తదితులున్నారు.

ఈసందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. రేపు ముఖ్యమంత్రి కెసిఆర్ నర్సాపూర్ లోని అర్భన్ పార్క్ లో మొదటి మొక్కను నాటి హరితహారాన్ని ప్రారంభిస్తారు. నేడు ఉదయం పదకొండు గంటలకు ముఖ్యమంత్రి నర్సాపూర్ వస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణాలో హరితహారం ద్వారా కోట్లాది మొక్కల్ని నాటుతున్నట్లు తెలిపారు.

- Advertisement -