- Advertisement -
కరోనా నియంత్రణ చర్యల్లో అవిశ్రాంతంగా పోరాటం చేస్తున్న వైద్య,పారిశుధ్య సిబ్బందికి శుభవార్తను అందించారు సీఎం కేసీఆర్. ప్రగతి భవన్‌లో మీడియాతో మాట్లాడిన సీఎం….వైద్య సిబ్బందికి పూర్తి జీతంతో పాటు సాలరీలో 10 శాతం గిఫ్ట్‌గా ప్రకటించారు.
ఇక పారిశుధ్య కార్మికులకు కూడా పూర్తి స్ధాయి వేతనాన్ని ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా పారిశుద్ధ్య కార్మికులు 95,392 మంది వరకు ఉంటారు. పారిశుద్ధ్య కార్మికుల జీతంలో విధించిన కోతను ఉపసంహరించుకుంటున్నామని సీఎం తెలిపారు.
సీఎం ప్రోత్సాహం కింద జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండబ్ల్యూఎస్ కార్యకర్తలకు రూ. 7,500 ,మున్సిపల్ మున్సిపల్, గ్రామపంచాయతీ పారిశుద్ద్య కార్మికులకు రూ. 5 వేలు ఇస్తాం అని ప్రకటించారు.
- Advertisement -