సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు చేసి మంత్రి సత్యవతి..

23
Minister Satyavathi Rathod

రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేసే ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షులు, మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్ కరోనా నుంచి త్వరగా కోలుకుని ఆరోగ్యంగా తిరిగి వచ్చి ప్రజా సేవ చేయాలని, కోవిడ్ బారిన పడ్డ రాష్ట్ర ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని, ఈ కరోనా పీడ త్వరగా వదిలి పోవాలని భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి, కోరుకున్నట్లు రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ , చీఫ్ విప్ శ్రీ దాస్యం వినయ్ భాస్కర్ తెలిపారు. అమ్మవారి ఆశీస్సులు యావత్తు ప్రజానీకం పై ఉండాలని, అందరినీ చల్లగా చూడాలని , ఈ ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని ప్రార్థించినట్లు చెప్పారు. శుక్రవారం సందర్బంగా అమ్మవారిని, దర్శించుకొని రాష్ట్ర సుభిక్షం కోసం పూజలు చేశామన్నారు.