మునుగోడుకు సీఎం..మాస్టర్ ప్లాన్

341
kcr
- Advertisement -

మునుగోడు ఉప ఎన్నికల సమరం తుది అంకానికి చేరుకుంది. ఎన్నికల ప్రచారానికి ఇంకా వారం రోజుల సమయం మాత్రమే ఉండటంతో ఎన్నికల రణరంగంలో దూసుకుపోతున్నాయి ప్రధానపార్టీలు. ఇక ప్రచారంలో మొదటి నుండి ముందంజలో ఉంది టీఆర్ఎస్. సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు, ఫ్లోరోసిస్ రక్కసిని తరిమికొట్టడంలో తీసుకున్న చర్యలను వివరిస్తూ ప్రజల్లోకి వెళ్తోంది. ప్రజల నుండి టీఆర్ఎస్‌కు మంచి స్పందన వస్తోంది.

ఇక ప్రచారంలో కాంగ్రెస్, బీజేపీ తేలిపోగా ఆ పార్టీలకు మరో షాక్. ప్రచారానికి సీఎం కేసీఆర్ రానున్నారు. సీఎంతో ప్రచారం మాత్రమే కాదు భారీ బహిరంగసభను ప్లాన్ చేస్తోంది గులాబీ పార్టీ. ఈ నెల 30న చండూరులో కేసీఆర్ బహిరంగ సభను నిర్వహించనున్నారు.

ఏకంగా లక్ష మందితో ప్రచార సభను నిర్వహించేందుకు టీఆర్ఎస్ నేతలు కసరత్తు చేస్తోన్నారు. సభకు లక్ష మందిని జనసమీకరించేలా ఇప్పటినుంచే ప్రయత్నాలు చేస్తోన్నారు. బస్సుల ద్వారా నియోకవర్గంలోని ప్రజలను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తోన్నారు. మనుగోడు ఉపఎన్నిక పోలింగ్ వచ్చే నెల 3వ తేదీన జరగనుండగా.. 6వ తేదీన కౌంటింగ్ నిర్వహించి ఫలితాలను ప్రకటించనున్నారు.

- Advertisement -