14న కొండగట్టుకు కేసీఆర్..

44
- Advertisement -

సీఎం కేసీఆర్ ఈ నెల 14న కొండగట్టులో పర్యటించనున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారించిన సీఎం…ఆలయ అభివృద్ధిపై అధికారులతో సమీక్షించనున్నారు. ఇటీవలే కొండగట్టు ఆలయాభివృద్ధికి రూ.100 కోట్ల కేటాయించిన సంగతి తెలిసిందే. యాదగిరిగుట్టకు ప్లాన్ ఇచ్చిన ప్రముఖ ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి, కొండగట్టు అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందించనున్నారు. సీఎం పర్యటన నేపధ్యంలో కొడిమ్యాల మండలం నాచుపల్లి జేఎన్టీయు కాలేజీలో హెలిప్యాడ్‌ను పరిశీలించారు జిల్లా ఎస్పీ భాస్కర్. జిల్లా అధికారులు సైతం సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు.

ఇప్పటికే తెలంగాణ తిరుమలగా యాదగిరిగుట్టను తీర్చిదిద్దగా కొండగట్టును సైతం యాదాద్రి తరహాలోనే అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -