జనగామకు సీఎం…భారీ బహిరంగసభ

100
kcr
- Advertisement -

నేటి నుండి జిల్లాల పర్యటను శ్రీకారం చుట్టారు సీఎం కేసీఆర్. ఇవాళ జనగామ జిల్లాలో పర్యటించనున్న సీఎం కేసీఆర్…పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. కొత్తగా నిర్మించిన జిల్లా సమీకృత భవన సముదాయంతోపాటు టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు.

అనంతరం యశ్వంతాపూర్‌ దగ్గర నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు సీఎం. ఉదయం 11గంటలకు హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి.. 11.30గంటలకు జనగామకు చేరుకుంటారు. ముందుగా కలెక్టరేట్‌ భవనం ప్రారంభిస్తారు.

మధ్యాహ్నం 12.20గంటల నుంచి 1.20గంటల వరకు ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. మధ్యాహ్నం మూడున్నర గంటలకు సభా ప్రాంగణానికి చేరుకొని ప్రసంగిస్తారు సీఎం.

- Advertisement -