స్వతంత్ర భారత వజ్రోత్సవ ముగింపు వేడుకలకు సీఎం కేసీఆర్

41
- Advertisement -

స్వతంత్ర భారత వజ్రోత్సవ ముగింపు వేడుకలను సెప్టెంబర్ 1 వ తేదీన హెచ్.ఐ.సి.సి లో అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలియచేశారు. స్వతంత్ర భారత వజ్రోత్సవ ముగింపు వేడుకల నిర్వహణ ఏర్పాట్లపై డా.బి.ఆర్.అంబేద్కర్ సచివాలయంలో నేడు ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు డా. కేవీ రమణ చారి, దేశపతి శ్రీనివాస్, డీజీపీ అంజనీ కుమార్ లతో సహా పలువురు కార్యదర్శులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్బంగా సి.ఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ, ఈ వజ్రోత్సవ ముగింపు ఉత్సవానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని అన్నారు. శుక్రవారం నాడు మధ్యాహ్నం జరిగే ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ ల చైర్మన్లు, మేయర్లు, మున్సిపల్ ఛైర్పర్సన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, జెడ్.పి.టి.సి లు, మండల పరిషద్ అధ్యక్షులు. డీసీసీబీ, డీసీఎంఎస్, రైతు బంధు సమితిల అధ్యక్షులు, ఆల్ ఇండియా సర్వీస్ అధికారులతో సహా పలువురు ప్రముఖులు పాల్గొంటారని వివరించారు. ఈ కార్యక్రంలో భాగంగా దాదాపు గంటసేపు దేశ భక్తి, స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని కలిగించే పలు సాంస్కృతిక కార్యక్రమాలుంటాయని, అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సందేశం ఉంటుందని వెల్లడించారు. ఈ వజ్రోత్సవ ముగింపు వేడుకలకు ఏవిధమైన ఇబ్బందులు కలుగ కుండా సంబంధిత అధికారులందరూ విస్తృత స్థాయిలో ఏర్పాట్లను చేయాలని అన్నారు.

Also Read:హీరోగా జబర్దస్త్ రాకేష్

ఈ సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు శైలజా రామయ్యర్, సందీప్ సుల్తానియా, జితేందర్, కార్యదర్శులు శ్రీనివాస రాజు, ఎస్.ఏ.ఎం. రిజ్వి, బుద్ధా ప్రకాష్, సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర, జలమండలి ఎండి దాన కిషోర్, జీహెచ్ఎంసీ కమీషనర్ రోనాల్డ్ రోస్, ఫైర్ సర్వీసుల డీజీ నాగిరెడ్డి, సమాచార పౌర సంబంధాల స్పెషల్ సెక్రెటరీ అశోక్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ ఎండి నర్సింహా రెడ్డి, మున్సిపల్ పరిపాలన శాఖ డైరెక్టర్ పమేలా సత్పతి, పంచాయితీ రాజ్ శాఖ కమీషనర్ హనుమంత రావు, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ తదితరులు హజరయ్యారు.

Also Read:రేవంత్ రెడ్డికి మళ్ళీ ఓటమి తప్పదా?

- Advertisement -