కే‌సి‌ఆర్ హ్యాట్రిక్ ఖాయమేనా ?

43
- Advertisement -

తెలంగాణ ఎన్నికల హడావిడి మామూలుగా లేదు. ఎన్నికలకు చాలా తక్కువ టైమ్ ఉండడంతో రాష్ట్ర రాజకీయం వేడెక్కింది. అధికార బి‌ఆర్‌ఎస్ తో పాటు కాంగ్రెస్ బీజేపీ పార్టీలు కూడా ఈసారి గెలుపుకోసం గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. అయితే ఎవరికి వారు గెలుపుపై ధీమాగానే ఉన్నారు. కాంగ్రెస్ ఇప్పటికే గెలిచేసినట్లు అత్యుత్సాహం ప్రదర్శిస్తోంది. లెక్కకు మించిన హడావిడి చేస్తూ అధికారంపై పగటి కలలు కంటోంది. అటు బీజేపీ కూడా దాదాపు ఇదే విధంగా వ్యవహరిస్తోంది. మరి నిజంగానే ఈ రెండు పార్టీలకు గెలుపు అవకాశాలు ఉన్నాయా..? బి‌ఆర్‌ఎస్ పార్టీకి పోటీనిస్తాయా ? ఇంతకీ సర్వేలు ఏం చెబుతున్నాయి.

ఇలాంటి ప్రశ్నలు అటు రాజకీయ వర్గాల్లోనూ ఇటు సామాన్య ప్రజల్లోనూ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇప్పటివరకు వెలువడిన అన్నీ సర్వేలు కూడా బి‌ఆర్‌ఎస్ కే పట్టం కట్టాయి. మూడోసారి కూడా కే‌సి‌ఆర్ సి‌ఎం పదవి అధిష్టించి చరిత్ర సృష్టిస్తారని చెబుతున్నాయి. తెలంగాణలో అటు అభివృద్ది ఇటు సంక్షేమం రెండు కూడా సమపాళ్లలో అందించే విధంగా కే‌సి‌ఆర్ పాలన సాగుతోంది. దాంతో కే‌సి‌ఆర్ పాలనపై ప్రజలు అత్యంత సానుకూలంగా ఉన్నారు. దాంతో ప్రత్యర్థి పార్టీలు ఎన్ని ప్రయత్నాలు చేసిన బి‌ఆర్‌ఎస్ గెలుపు తథ్యం అని అటు విశ్లేషకులు సైతం వారి అభిప్రాయలను వెళ్ళబుచ్చుతున్నారు.

ఇదిలా ఉంచితే అటు ప్రత్యర్థి పార్టీలు బి‌ఆర్‌ఎస్ కు పోటీనిచ్చేంత బలంగా లేవనేది కొందరి అభిప్రాయం. ప్రస్తుతం కాంగ్రెస్ లో ఇంకా సి‌ఎం అభ్యర్థి ఎవరో తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు ఆ పార్టీ నేతలు. రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఇలా ప్రతిఒక్కరు సి‌ఎం పదవి కోసం ఆరాట పడుతున్నవారే. దాంతో ఏ ఒక్కరిని సి‌ఎం అభ్యర్థిగా ప్రకటించిన ఇతరుల నుంచి వ్యతిరేకత ఏర్పడడం ఖాయం. అది కాస్త పార్టీ గెలుపోటములపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అటు బీజేపీ విషయానికొస్తే ఆ పార్టీకి నియోజిక వర్గాల వారీగా అసలు సరైన అభ్యర్థులే లేని పరిస్థితి. అందువల్ల ఎలా చూసిన ఈసారి కూడా బి‌ఆర్‌ఎస్ అధికారంలోకి రావడం, కే‌సి‌ఆర్ హ్యాట్రిక్ సి‌ఎం గా చరిత్ర సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

Also Read:డార్లింగ్ సరసన అందాల ‘నిధి’!

- Advertisement -