డార్లింగ్ సరసన అందాల ‘నిధి’!

32
- Advertisement -

నిధి అగర్వాల్‌ ప్రస్తుతం ఈ భామ పవన్‌ కల్యాణ్‌ సరసన ‘హరి హర వీరమల్లు’ చిత్రంలో నటిస్తున్నది. తాజా సమాచారం ప్రకారం తెలుగులో ఈ భామ మరో బంపరాఫర్‌ను చేజిక్కించుకున్నట్లు తెలిసింది. బెంగళూరుకి చెందిన ఈ బ్యూటీ.. డార్లింగ్ ప్రభాస్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి ‘రాజా డీలక్స్’ అనే పేరు పరిశీలనలో ఉంది. ఈ సినిమా షూటింగ్‌ లో నిధి త్వరలోనే జాయిన్ కానున్నట్లు టాక్. ఈ సినిమాని దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్నారు.

పైగా ప్రభాస్ ఈ సినిమాలో రెండు క్యారెక్టర్స్ లో కనిపించబోతున్నాడు. ప్రభాస్ రెండో క్యారెక్టర్ సరసన నిధి అగర్వాల్ నటిస్తోంది. అయితే, హైదరాబాద్‌లో ప్రభాస్ ఫ్యాన్స్ హంగామా చేశారు. సుదర్శన్‌ థియేటర్‌లో యోగి రీరిలీజ్‌ సందర్భంగా ఈ సంఘటన చోటు చేసుకుంది. రెచ్చిపోయిన ప్రభాస్ ఫ్యాన్స్ టాకీస్‌లోని స్క్రీన్‌తో పాటు ఫర్నీచర్, అద్దాలు ధ్వంసం చేశారు. అయితే దీనిపై థియేటర్‌ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఇప్పటికే ఇద్దరిని చిక్కడపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

తన అభిమానుల పై ఎలాంటి చర్యలు తీసుకోకుండా వారిని వదిలి పెట్టాలని ప్రభాస్ పోలీసుల్ని కోరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ సలార్ సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు. ఇక ఈ మూవీ అమెరికాలో ఐమ్యాక్స్ ఫార్మాట్లో అభిమానులను అలరించనుంది. ఈ సినిమాను ఐమ్యాక్స్ ఫార్మాట్లోనూ రిలీజ్ చేయనున్నట్లు US డిస్ట్రిబ్యూటర్లు అధికారికంగా ధృవీకరించారు. త్వరలోనే ఈ ఐమ్యాక్స్ వెర్షన్ కోసం టికెట్ల బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. అయితే భారత్ లో ఈ ఐమ్యాక్స్ వెర్షన్ రిలీజ్ అవుతుందా లేదా అనేది ఇంకా తెలియలేదు.

Also Read:ప్రభాస్ ‘కల్కి’లో మరో స్టార్ హీరో

- Advertisement -