కొత్త రెవెన్యూ చట్టంపై సీఎం కేసీఆర్ ఫోకస్..!

342
cm kcr
- Advertisement -

రాష్ట్రంలో వివిధ ఎన్నికలు జరుగుతుండటంతో కొన్ని నెలలుగా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. నేటితో స్ధానికసంస్థల ఎన్నికల కోడ్ ముగియనుండటంతో పరిపాలనపై దృష్టిసారించారు సీఎం కేసీఆర్. త్వరలో కలెక్టర్లతో నిర్వహించే కాన్ఫరెన్స్‌లో రెవెన్యూ శాఖ ప్రక్షాళనే లక్ష్యంగా దిశానిర్దేశం చేయనున్నారు. కలెక్టర్లతో సమావేశం ముగిసిన వెంటనే కొత్త రెవెన్యూ చట్టంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది.

రెవెన్యూ శాఖలో సంస్కరణలు తెస్తామని, వీటిని జూన్‌లో మొదలు పెడతామని ప్రకటించారు సీఎం కానీ స్థానిక సంస్థల కోడ్‌ అడ్డుగా ఉండటంతో కోడ్ ముగిసిన వెంటనే పాలనా వ్యవహారాలపై ఫోకస్‌ పెట్టాలని భావిస్తున్నారు.

ఇక కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో మ్యూటేషన్లు, డిజిటల్‌ సంతకాలు, భూ రికార్డుల ప్రక్షాళన పురోగతిపై చర్చించే అవకాశం ఉంది. చట్టంలో పొందుపరచాల్సిన అంశాలు, రెవెన్యూ శాఖ రద్దు, విలీనం, సంస్కరణలు ఇతరత్రా అంశాలపై కీలక అడుగు వేసే వీలుంది.

రెవెన్యూ రికార్డుల నవీకరణలో జాప్యం, ధరణి వెబ్‌సైట్‌లో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలు, మ్యూటేషన్లు, పాస్‌పుస్తకాల జారీ పెండింగ్‌పై స్పష్టమైన వివరాలు పంపాలని భూ పరిపాలనా ప్రధాన కమిషనర్‌(సీసీఎల్‌ఏ) కార్యాలయం కలెక్టర్లను ఆదేశించింది.

- Advertisement -