బీజేపీ నేతలకు సీఎం కేసీఆర్‌ దిమ్మతిరిగే కౌంటర్‌..

66
- Advertisement -

ముఖ్యమంత్రి కేసీఆర్‌ సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని బీజేపీ నేతల వ్యాఖ్యలపై కౌంటర్‌ ఎటాక్‌గా సీఎం కేసీఆర్‌ వరుసగా రెండో రోజు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌పై సీఎం కేసీఆర్ తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. బండి సంజ‌య్ ఇవాళ మాట్లాడుతూ.. తాను అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్ప‌కుండా.. మిగ‌తా విష‌యాల‌న్ని మాట్లాడిండు. వ‌డ్ల గురించి మాట్లాడ‌కుండా.. సొల్లు పురాణం మాట్లాడిండు అని కేసీఆర్ ధ్వ‌జ‌మెత్తారు. దీన్ని బ‌ట్టే తెలంగాణ రైతాంగం అర్థం చేసుకోవాలి. కేంద్రం మొండి వైఖ‌రి వీడ‌ట్లేదు. రైతుల ఉద్య‌మాలు కొన‌సాగుతున్నాయి. గ‌ట్టిగా నిల‌దీస్తే దేశ‌ద్రోహి. మ‌ద్ద‌తు ఇచ్చిన‌ప్పుడు దేశ‌ద్రోహులం కాదు. ప‌లు బిల్లుల‌కు మ‌ద్ద‌తు ఇచ్చిన‌ప్పుడు దేశ ద్రోహులం కాదు.. గ‌ట్టిగా మాట్లాడి నిజాలు బ‌య‌ట‌పెట్టి ప్ర‌జ‌ల ప‌క్షాన నిల‌దీస్తే.. వాళ్లు దేశ‌ద్రోహులు. ఇది బీజేపీ స్టైల్. దేశంలో ఎవ‌రూ నిల‌దీసినా.. ఉన్న విష‌యాలు కుండ‌బ‌ద్ద‌లు కొడితే వారు దేశద్రోహులు అయిపోతారు. రెండు, మూడు ర‌కాలు స్టాంపులు త‌యారు చేశారు. ఇంకా గ‌ట్టిగా మాట్లాడితే అర్బ‌న్ న‌క్స‌లైట్.. ఇవ‌న్నీ దేశంలో ప‌రంప‌ర కొన‌సాగుతున్నాయి.

మేఘాల‌య గ‌వ‌ర్న‌ర్ స‌త్య‌పాల్ మాలిక్ మాట్లాడుతూ.. రైతు చ‌ట్టాలు రైతుల‌కు వ్య‌తిరేకం అని మాట్లాడారు. బీజేపీ ఎంపీ వ‌రుణ్ గాంధీ కూడా రైతుల‌కు సంఘీభావం తెలిపారు. చ‌ట్టాల‌ను ఉప‌సంహ‌రించుకోవాల‌ని డిమాండ్ చేశారు. మేఘాల‌య గ‌వ‌ర్న‌ర్, వ‌రుణ్ గాంధీ కూడా దేశ ద్రోహులేనా? దేశం దురాక్ర‌మ‌ణ జ‌ర‌గ‌కూడ‌దు. దాన్ని నిరోధించాల‌ని చెబితే దేశ ద్రోహి అంటున్నారు. కేసీఆర్ చైనాలో డ‌బ్బులు దాచుకున్నాడంటా? ఒక త‌ల తోక లేదు. ఇష్టం వ‌చ్చిన సొల్లును, ఇష్టం వ‌చ్చిన‌ట్టు గుమ్మ‌రించి మాట్లాడుతున్నారు. ధాన్యం ఎంత కొంటావో చెప్పాలి. పంజాబ్‌లో పూర్తిస్థాయి ధాన్యం సేక‌రిస్తున్నారు. తెలంగాణ వ‌డ్ల‌ను కేంద్రం కొంట‌దా? కొన‌దా? అని సూటిగా ప్ర‌శ్నిస్తున్నాం. ఒక ప్రాంతీయ పార్టీ అధ్య‌క్షునిగా సీదా అడుగుతున్నా. స‌మాధానం చెప్పే వ‌ర‌కు బీజేపీని, కేంద్రాన్ని వ‌దిలిపెట్టమని సీఎం హెచ్చరించారు.

- Advertisement -