‘అఖండ’ టైటిల్ సాంగ్ రిలీజ్‌..

91
Akhanda title song
- Advertisement -

నటసింహా నందమూరి బాలకృష్ణ స్టార్ డైరెక్టర్ బోయపాటి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ అఖండ మీద భారీ స్థాయిలో క్రేజ్ నెలకొంది. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ మీద యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్ జంటగా నటిస్తోంది. తాజాగా ఈ చిత్రం నుంచి ఈరోజు టైటిల్ సాంగ్ రిలీజైంది.

‘భం అఖండ… భం భం అఖండ’ అనే ఈ టైటిల్ సాంగ్‌ను చిత్రబృందం యూట్యూబ్‌లో విడుదల చేసింది. ఈ హైఓల్టేజ్ సాంగ్‌కు తమన్ బాణీలు అందించగా, అనంత శ్రీరామ్ సాహిత్యం అందించాడు. ఈ పాటను మహదేవన్ త్రయం (శంకర్, సిద్ధార్థ్, శివం) ఆలపించింది. ఈ సినిమా నుంచి ఇటీవలే బాలయ్య లుక్ విడుదల కాగా, అభిమానుల నుంచి విశేష స్పందన లభించింది.

- Advertisement -