పి‌ఎంగా కే‌సి‌ఆర్.. పర్ఫెక్ట్?

67
- Advertisement -

ప్రస్తుతం దేశ రాజకీయాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కే‌సి‌ఆర్ పేరు గట్టిగా వినిపిస్తోంది. టి‌ఆర్‌ఎస్ ను బి‌ఆర్‌ఎస్ గా మార్చి దేశ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తరువాత ప్రస్తుతం దేశ ప్రజల దృష్టి కే‌సి‌ఆర్ పై పడింది. కేంద్రంతో కొట్లాడి తెలంగాణ సాధించిన పోరాటపటిమ ఉన్న నాయకుడిగా దేశ ప్రజల దృష్టిలో కే‌సి‌ఆర్ కు మంచి పేరుంది. దానికి తోడు రాష్ట్రం ఏర్పాడ్డాక తొలి ముఖ్యమంత్రిగా తెలంగాణలో కే‌సి‌ఆర్ తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు.. ఆయన అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు రాష్ట్రంలో సాధిచిన ప్రగతి ఇలా ప్రతి అంశం ఇతర రాష్ట్ర ప్రభుత్వాలకు స్పూర్తిదాయకంగా నిలుస్తోంది. దీంతో ప్రస్తుతం అన్నీ రంగాల్లో అగ్రగామిగా దూసుకుపోతోంది తెలంగాణ రాష్ట్రం.

ఈ తరహా డెవలప్ మెంట్ ను దేశమంతా విస్తరించి దేశాన్ని రైతు రాజ్యంగా మార్చాలని కే‌సి‌ఆర్ జాతీయ రకాకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కొద్ది రోజుల్లోనే దేశ ప్రజలు కే‌సి‌ఆర్ విజనరీ ఆలోచనలకు బ్రహ్మరథం పట్టారు. ఇప్పటికే మహారాష్ట్రలో అక్కడి స్థానిక పార్టీలను సైతం తలదన్నెలా బి‌ఆర్‌ఎస్ కు ఆధారణ లభిస్తోంది. అటు ఉత్తరప్రదేశ్, బిహార్, వంటి రాష్ట్రాలలో కూడా బి‌ఆర్‌ఎస్ కు అల్వెస్ వెల్కం పలుకుతున్నారు అక్కడి ప్రజలు. దీంతో దేశమంతా కూడా కే‌సి‌ఆర్ పాలనను ఆకాంక్షిస్తూ ప్రధాని కావాలని కోరుకుంటున్నారు. చాలమంది ప్రముఖులు కూడా దేశానికి కే‌సి‌ఆర్ లాంటి వారు ప్రధాని కావాలని ఆశిస్తున్నారు.

Also Read:నాయక్ కు బ్రేక్ వేసిన మెగా కాంపౌండ్

ఇక వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ వంటి ప్రధాన పార్టీలకు బి‌ఆర్‌ఎస్ గట్టిపోటీనిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న జాతీయ రాజకీయాలను పరిశీలిస్తే అటు బీజేపీకి ఇటు కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయ పార్టీగా ఒక బి‌ఆర్‌ఎస్ మాత్రమే కనిపిస్తోంది. నిన్న మొన్నటి వరకు ఆమ్ ఆద్మీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ వంటివి జాతీయ రాజకీయాల్లో కనిపించిన ఇప్పుడు కాంగ్రెస్ దోస్తీలోకి వెళ్లిపోయాయి. దీంతో దేశ రాజకీయాల్లో ఆల్టర్నేట్ పార్టీగా బి‌ఆర్‌ఎస్ మాత్రమే ఉంది. దీంతో వచ్చే ఎన్నికల్లో ఏ మాత్రం సీట్లు గెలిచిన కే‌సి‌ఆర్ కింగ్ మేకర్ పాత్ర పోషించే అవకాశం ఉంది. ఇదే గనుక జరిగితే 2024లోనే కే‌సి‌ఆర్ ను ప్రధానిగా చూడవచ్చనేది కొందరు విశ్లేషకులు చెబుతున్నా మాట.

Also Read:‘మట్కా’ కోసం హైదరాబాద్‌కు నోరా ఫతేహి!

- Advertisement -