జిల్లాల పర్యటనకు సీఎం కేసీఆర్..!

194
cm kcr
- Advertisement -

త్వరలో సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటన చేపట్టే అవకాశం ఉంది. టీఆర్‌ఎస్‌ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించిన గులాబీ బాస్… నల్లగొండ జిల్లా నేతలతో సమావేశం సందర్భంగా ఈ విషయాన్ని ప్రస్తావించినట్టు సమాచారం.

హాలియా పర్యటన అనంతరం ఏప్రిల్‌లో భారీ బహిరంగసభను నిర్వహించే యోచనలో ఉన్నారు గులాబీ బాస్. రూ.3 వేల కోట్లతో నెల్లికల్లుతోపాటు 8 నుంచి 9 ఎత్తిపోతల పథకాలను నిర్మించనున్నట్టు సీఎం కేసీఆర్‌ తెలిపారు. ఈ నెల 10న మధ్యాహ్నం 12.30 గంటలకు నెల్లికల్లు ఎత్తిపోతల పథకానికి సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు హాలియాలో జరిగే టీఆర్‌ఎస్‌ పార్టీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. పార్టీ ఆవిర్భవించిన తొలినాళ్లల్లో హాలియా నుంచి సూర్యాపేట వరకు ఏ లక్ష్యంతో పాదయాత్ర చేపట్టామో అది నెరవేరిందని, నల్లగొండ కొంత భాగం మినహా అంతాసాగులోకి వచ్చి రైతుల జీవితాలు బాగుపడ్డ విషయాన్ని సీఎం కేసీఆర్‌ గుర్తుచేశారు. అయితే సీఎం జిల్లాల పర్యటన ఏప్రిల్‌కు ముందుగా ఉంటుందా లేదా తర్వాత ఉంటుందా అనేదానిపై త్వరలోనే క్లారిటీ రానుంది.

- Advertisement -