రచయిత జ్వాలాను అభినందించిన సీఎం కేసీఆర్..

63
CM KCR

ముఖ్యమంత్రి ప్రధాన పౌర సంబంధాల అధికారి వనం జ్వాలా నరసింహారావు, తాను ఇటీవల రచించిన ‘‘తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ ఎట్ ఎ గ్లాన్స్’’, ‘‘శ్రీ మద్భాగవత కథలు’’ పుస్తకాలను ఆదివారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు అందించారు. తెలంగాణ రాష్ట్రంలో తెచ్చిన పరిపాలనా సంస్కరణలు, రెవెన్యూ చట్టాల అమలు తీరుతెన్నులపై విశ్లేషణాత్మకమైన వ్యాసాలతో ‘‘తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ ఎట్ ఎ గ్లాన్స్’’ గ్రంథంలో వివరించారు. మహాకవి బమ్మెర పోతనామాత్యుడు రచించిన మహా భాగవతం ఆధారంగా ‘‘శ్రీమద్భాగవత కథలు’’గా సంక్షిప్తీకరించారు. ప్రజలకు ఉపయోగపడే రచనలు చేశారని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రచయిత జ్వాలాను అభినందించారు.