ఇస్రో శాస్త్ర‌వేత్త‌ల‌కు సీఎం కేసీఆర్‌ అభినందనలు..

134
CM KCR
- Advertisement -

పీఎస్ఎల్వీ-సీ51 ఈ రోజు నింగిలోకి దూసుకెళ్లి, బ్రెజిల్ కు చెందిన అమోజోనియా శాటిలైట్‌ను నిర్ణీత క‌క్ష్య‌లోకి ప్ర‌వేశ‌పెట్టిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఇస్రో శాస్త్ర‌వేత్త‌ల‌కు ప‌లువురు ప్ర‌ముఖులు అభినంద‌న‌లు తెలిపారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ( ఇస్రో) ద్వారా దేశ ఖ్యాతి మరింత వర్ధిల్లుతున్నదని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. అగ్రశ్రేణి అంతరిక్ష పరిశోధన సంస్థగా ఇస్రో మరోసారి నిలిచిందని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు.

అంతరిక్ష పరిశోధనల్లో పలు దేశాలు సాయం కోసం ఇస్రోను ఆశ్రయిస్తున్నాయని గుర్తుచేశారు. ప్రయోగ విజయవంతానికి కృషి చేసిన శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, సాంకేతిక సిబ్బందిని, ఉద్యోగులను కేసీఆర్‌ అభినందించారు. ఆదివారం పీఎస్ఎల్‌వీ-సీ 51 బ్రెజిల్‌కు చెందిన అమెజానియా-1తో సహా 18 స్వదేశీ ఉప‌గ్రహాల‌ను ఇస్రో విజ‌య‌వంతంగా క‌క్ష్యలోకి ప్రవేశ‌పెట్టడాన్ని ఆయన అభినందించారు.

- Advertisement -