టీమిండియాకు సీఎం కేసీఆర్ అభినందనలు

100
- Advertisement -

ఉప్పల్ వేదికగా జరిగిన మూడో టీ20లో విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకున్న భారత క్రికెట్ జట్టును అభినందించారు సీఎం కేసీఆర్. హైదరాబాద్‌ వేదికగా భారత జట్టు సిరీస్‌ కైవసం చేసుకోవడంపై సీఎం హర్షం వ్యక్తం చేశారు.

ఎటువంటి ఆటంకాలు లేకుండా మ్యాచ్‌ను సమర్థవంతంగా నిర్వహించిన క్రీడాశాఖ మంత్రి, పోలీస్‌ అధికారులు, స్టేడియం సిబ్బందిని సీఎం ప్రత్యేకంగా అభినందించారు.చివరి ఓవర్‌ వరకు నువ్వానేనా అన్నట్లు సాగిన ఉత్కంఠభరితంగా సాగిన పోరులో క్రీడాస్ఫూర్తిని ప్రదర్శిస్తూ.. క్రీడాభిమానులకు పరుగుల విందు అందించిన ఇరు జట్ల క్రీడాకారులను సీఎం అభినందించారు.

- Advertisement -