బిగ్ బాస్ 6..నేహా చౌదరి ఎలిమినేట్

131
- Advertisement -

బిగ్ బాస్ తెలుగు 6 విజయవంతంగా మూడు వారాలు పూర్తి చేసుకుంది. మూడో వారంలో భాగంగా నేహా చౌదరి ఎలిమినేట్ అయ్యారు. సండే ఫన్‌ డేలో భాగంగా వింత టాస్క్‌లు ఇచ్చి ఎంటర్‌టైన్ చేశారు బిగ్ బాస్.

మొదట ఇంటి సభ్యులకి సుత్తిదెబ్బ అనే ఓ టాస్క్ ఇచ్చారు. ఇందులో కంటెస్టెంట్స్ ఒక్కొక్కరికి ఒక్కో ట్యాగ్ ఇవ్వాలి అక్కడ ఉన్న ఆడియన్స్ దానికి ఒప్పుకుంటే ఓకే. లేకపోతే సుత్తిదెబ్బ తినాల్సి ఉంటుంది. ఇందులో నోటి దూల, హార్ట్ లెస్, బిట్టర్, యూజ్ లెస్ అనే కొన్ని వర్డ్స్ ని ఇచ్చారు. దీంట్లో కంటెస్టెంట్స్, ఆడియన్స్, నాగార్జున కూడా గీతూకి నోటిదూల అని తేల్చేశారు.

ఇక ఈ టాస్క్ లో కొన్ని జంతువుల పేర్లు ఇచ్చి వాటిని కూడా ట్యాగ్ చేయమన్నారు. ఇందులో పాము, గాడిద, ఊసరవెల్లి, ఏనుగు, సింహం.. లాంటి జంతువుల ట్యాగులు ఉండగా వాటిని ఎందుకు ఇస్తున్నారో కూడా చెప్పామన్నారు. కంటెస్టెంట్స్ ఒక్కొక్కరికి ఆ ట్యాగ్ ఇచ్చి ఎందుకు ఇచ్చారో చెప్పారు. ఆ తర్వాత కంటెస్టెంట్స్ అందరికి కలిపి ఓ టాస్క్ ఇచ్చారు. ఇందులో సభ్యులని రెండు గ్రూపులుగా విడగొట్టారు. ఈ టాస్కులో బాలాదిత్య బాగా ఆడటంతో అతనికి బెస్ట్ కంటెస్టెంట్ గా పేరు ఇచ్చారు.

ఇక ఒక్కొక్కరిని సేవ్ చేసుకుంటూ వచ్చిన నాగ్…చివరగా నేహా చౌదరి ఎలిమినేట్ అయినట్లు తెలిపారు. రేవంత్‌, ఆరోహి, ఇనయ, అర్జున్‌, గీతూ, వాసంతి దుమ్మున్న వాళ్లు అని దానికోసం ఏదైనా చేస్తారని, వారి ఆట తీరు కరెక్ట్ కాదని తెలిపింది.

- Advertisement -