రెండు పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ నేడు ఉదయం శ్రీవిఠల్ రుక్మిణీ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అంతకంటే ముందు షోలాపూర్ నుంచి పండరీపరాన్నికి చేరుకున్న సీఎం కేసీఆర్‌కు ఆలయ నిర్వహకులు, అర్చకులు ఉత్వర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకునేందుకు వెళ్లారు. పూజాది కార్యక్రమాల్లో భాగంగా సీఎం కేసీఆర్ అమ్మవారి పాదాలను పసుపు కుంకుమలతో అలంకరించి మొక్కుకున్నారు. ఆలయ ఆర్చకులు సీఎం కేసీఆర్ మెడలో తులసి మాల వేసి వేదమంత్రాలతో ఆశీర్వాదం అందజేశారు.
అనంతరం శ్రీవిఠలేశ్వర స్వామి, రుక్మిణీ అమ్మవార్లతో కూడిన ప్రతిమను, అదేవిధంగా రుక్మిణీ అమ్మవారి చిత్రపటాన్ని సీఎం కేసీఆర్‌కు బహూకరించారు. దేశంలో రైతులంతా క్షేమంగా ఉండాలని ఈ సందర్భంగా సీఎం ప్రార్థించారు. అనంతరం సీఎం అక్కడి నుంచి సర్కోలీ గ్రామానికి బయలుదేరారు. సీఎం వెంట బీఆర్‌ఎస్ ఎంపీ నామా నాగేశ్వరావు, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌రావు, డీ దామోదర్ రావు, పలువురు తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు.
Also Read: బండి.. కమ్ టూ ఢిల్లీ !
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పండరీ పురంలోని వీధుల గుండా నడుచుకుంటూ వెళ్లారు. ఈ సందర్భంగా ఓ భక్తుడు కేసీఆర్‌కు శ్రీవిఠల్ రుక్మణీ ప్రతిమను బహూకరించాడు. పలువురు మరాఠీ భక్తులు సీఎంను చూసేందుకు ఉత్సాహం చూపారు. ప్రత్యేక పూజల అనంతరం సమీప గ్రామంలో పార్టీ కార్యకర్తలతో సీఎం సమావేశం కానున్నారు. అక్కడ స్థానిక నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు శక్తిపీఠం తుల్జాపూర్ భవానీ ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకోనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో మహారాష్ట్రలోని భారత రాష్ట్ర సమితి కార్యకర్తలు భారీ స్థాయిలో పండరీపురం చేరుకున్నారు.
Also Read: CMKCR:ఘనస్వాగతం