విజయ నిర్మల భౌతికకాయానికి నివాళులర్పించిన సీఎం కేసీఆర్

317
cm kcr
- Advertisement -

సినీ నటి, దర్శకురాలు, కృష్ణ సతీమణి విజయనిర్మల కన్నుమూయడంతో తెలుగు సినీ పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఇండస్ట్రీకి ఆమె చేసిన సేవలను గుర్తు చేసుకుంటు పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. నానక్‌రామ్‌ గూడలోని విజయనిర్మల భౌతిక కాయానికి నివాళులు అర్పించారు కేసీఆర్‌. ఆమె మృతి సినీ పరిశ్రమకు తీరని లోటన్నారు. సీఎం వెంట మంత్రులు తలసాని,ఎర్రబెల్లి దయాకర్ రావు,ఎంపీ సంతోష్ ఉన్నారు.

ఇక విజయనిర్మల భౌతికకాయాన్ని చూసి కృష్ణ, ఆయన సతీమణి ఇందిరా దేవి, తనయుడు నరేశ్‌ కన్నీరుమున్నీరయ్యారు. మంజుల, మహేశ్‌బాబు, నమ్రతలు పూలమాల వేసి నివాళులర్పించారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, మురళీ మోహన్‌ తదితరులు విజయనిర్మల భౌతికకాయానికి శ్రద్ధాంజలి ఘటించారు.

- Advertisement -