- Advertisement -
మాజీ మంత్రి ముఖేశ్ గౌడ్ అంత్యక్రియలను అధికారికంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు నిర్ణయించారు. అధికారిక అంత్యక్రియల కోసం తగిన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ని సీఎం ఆదేశించారు.
మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మంత్రిగా, ఎమ్మెల్యేగా ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థించారు. ముఖేష్ గౌడ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
- Advertisement -