- Advertisement -
సిపిఐ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపి గురుదాస్ దాస్ గుప్తా మరణం పట్ల ముఖ్యమంత్రి కెసిఆర్ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. ప్రజా హక్కుల సాధన కోసం పీడిత ప్రజల పక్షాన ఆయన చేసిన పోరాటాలను ముఖ్యమంత్రి కొనియాడారు. తాను ఎంపీగా, కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో గురుదాస్ దాస్ గుప్తాతో ఉన్న అనుబంధాన్ని ముఖ్యమంత్రి గుర్తుచేసుకున్నారు. ఆయన కుటుంబసభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
గత కొన్నాళ్లుగా ఊపిరితిత్తుల క్యాన్సర్, మూత్రపిండాల వ్యాధులతో సతమతమవుతున్న ఆయన ఉదయం కోల్‌కతాలోని భవానీపూర్ లో ఉన్న తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య జయశ్రీ దాస్ గుప్తా, ఓ కుమార్తె ఉన్నారు. రెండుసార్లు లోక్‌సభకు, మూడుసార్లు రాజ్యసభకు ఎంపికయ్యారు గురుదాస్ గుప్తా. సీపీఐ లోక్‌సభా పక్ష నేతగా పనిచేశారు.
- Advertisement -