త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వెంకటేష్‌..!

471
trivikram venaktesh
- Advertisement -

వెంకటేష్ హీరోగా తెరకెక్కిన నువ్వు నాకు నచ్చావ్ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. కామెడీ ప్రధానంగా తెరకెక్కిన ఈ చిత్రం వెంకీ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ మూవీగా నిలిచింది. ఇప్పటికీ ఈ సినిమా ఎవర్‌గ్రీన్ మూవీనే. త్రివిక్రమ్ మాటలకి వెంకీ కామెడీ టైమింగ్ తోడవడంతో ప్రేక్షకుల నుంచి ఉహించని రెస్పాన్స్ వచ్చింది. తర్వాత వచ్చిన మల్లీశ్వరి మూవీకి కూడా మాటలు అందించిన త్రివిక్రమ్ తన మార్క్ స్పష్టంగా చూపించాడు.

ఇక ఇప్పటివరకు వెంకటేష్ సినిమాలకు మాటలు మాత్రమే అందించిన ఇకపై డైరెక్ట్ కూడా చేయనున్నారు. ఈ మేరకు హారికా అండ్ హాసిని క్రియేషన్స్ అఫిషియల్ అనౌన్స్‌ మెంట్ ఇచ్చేసింది.

ప్రస్తుతం వెంకటేష్…నాగచైతన్యతో కలిసి వెంకీమామ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ తర్వాత అసురన్ రీమేక్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ రెండు సినిమాల తర్వాత త్రివిక్రమ్‌తో వెంకీ మూవీ పట్టాలెక్కనుంది. వెంకటేష్‌ 75వ సినిమాగా వస్తున్న ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

- Advertisement -