టీఎన్‌ శేషన్ మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం

457
cm kcr
- Advertisement -

ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ టిఎన్ శేషన్ మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. నిబద్థత కలిగిన అధికారిగా సేవలు అందించడం ద్వారా అందరికీ స్పూర్తిగా నిలిచారని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

దేశంలో ఎన్నికల సంస్కరణలకు బాటలుపరిచిన గత కొన్నేండ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. చెన్నైలోని తన నివాసంలో ఆదివారం రాత్రి 9.30 గంటల సమయంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.

కేరళలోని పాలక్కడ్‌ జిల్లా తిరునళ్లైలో1932 డిసెంబర్‌ 15న శేషన్‌ జన్మించారు. 1990-96 మధ్య దేశ ఎన్నికల ప్రధాన కమిషనర్‌గా పనిచేశారు. దేశంలో ఎన్నికల అక్రమాలను గణనీయంగా తగ్గించడంలో ఆయన కీలకపాత్ర పోషించారు.1997లో ఆయన పదవీ విరమణ చేశారు. అనంతరం రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీచేసినప్పటికీ, కేఆర్‌ నారాయణన్‌ చేతిలో ఓడిపోయారు.

- Advertisement -