ప్రముఖ సినీ హాస్యనటుడు వేణు మాధవ్ మృతిపట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. వేణుమాధవ్ కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. వేణుమాధవ్ తన నటనతో అనేక మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని సీఎం కేసీఆర్ ఆ భగవంతుడిని ప్రార్థించారు. గత కొంత కాలంగా కాలేయ వ్యాధితో బాధపడుతున్న వేణు మాధవ్ ఇవాళ మధ్యాహ్నం యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
వేణుమాధవ్ తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కోదాడలో జన్మించిన జన్మించారు. వేణుమాధవ్ భార్య శ్రీవాణి, ఆయనకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. 1997లో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన.. సంప్రదాయం చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం అయ్యారు. లక్ష్మీ సినిమాకు ఉత్తమ హాస్యనటుడిగా నంది అవార్డును అందుకున్నారు.
మాస్టర్, తొలిప్రేమ, సుస్వాగతం, తమ్ముడు సినిమాలతో హాస్యనటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. హంగామా సినిమా ద్వారా వేణుమాధవ్ హీరోగా కూడా మారారు. ఇప్పటి వరకు దాదాపు 600 సినిమాల్లో వేణుమాధవ్ నటించారు. ఆయన చివరిగా రుద్రమదేవి సినిమాలో నటించారు.