మోదీ ఇదేనా మీ పార్టీ, మీ మర్యాద.. నిప్పులు చెరిగిన కేసీఆర్..

37
- Advertisement -

ఇవటీల రాహుల్ గాంధీపై అస్సాం ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారు. అస్సాం ముఖ్య‌మంత్రిగా ఉన్న వ్య‌క్తి.. రాహుల్ గాంధీని నువ్వు ఏ అయ్య‌కు పుట్టిన‌వో అడిగిన‌మా మేము అని అంటారా.. ఈ మాట అనొచ్చునా.. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ.. బీజేపీ సంస్కారం ఇదేనా.. మ‌న‌ హిందూ ధ‌ర్మం ఇదేనా.. మ‌న దేశం మ‌ర్యాద ఇదేనా.. ఒక నేత‌ను ప‌ట్టుకొని ఏం మాట‌లు మాట్లాడున్నారు.. ముఖ్య‌మంత్రి అలాంటివి అడుగుతారా? అని సీఎం కేసీఆర్ ప్ర‌శ్నించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని రాయ‌గిరిలో జ‌రిగిన భారీ బ‌హిరంగ స‌భ‌లో పాల్గొన్న సీఎం కేసీఆర్.. కాంగ్రెస్ నేత‌, ఎంపీ రాహుల్ గాంధీకి పార్ల‌మెంట్‌లో జ‌రిగిన అవ‌మానం గురించి ప్ర‌స్తావించారు.

రాహుల్ గాంధీ అనే ఎంపీ.. కాంగ్రెస్ పార్టీ నాయ‌కుడు. ఆయ‌న‌తో నాకు సంబంధం లేదు. కానీ.. వాళ్ల నాయ‌న‌మ్మ‌, నాన్న ఈ దేశం కోసం చ‌నిపోయారు. వాళ్ల తాత స్వ‌తంత్ర పోరాటం చేసి అనేక సంవ‌త్స‌రాలు ప్ర‌ధాన మంత్రిగా ప‌ని చేశారు. ఇవాళ రాహుల్ గాంధీ ఎంపీగా ఉన్నాడు. రాజకీయాల్లో ఉన్న‌ప్పుడు మాట్లాడుతం. చ‌ర్చ జ‌రుగుత‌ది. ఇది ప్ర‌జాస్వామ్యం. ప్ర‌జ‌లు అడుగుత‌రు. ప్ర‌జ‌ల త‌రుపున ప్ర‌జాప్ర‌తినిధులు కూడా అడుగుత‌రు.

రాహుల్ గాంధీ ఏదో అడిగితే.. అస్సాం బీజేపీ ముఖ్య‌మంత్రి ఏం మాట్లాడారండి.. ద‌య‌చేసి మీరు ఆలోచించాలి..నాకే క‌ళ్ల‌లో నీళ్లు తిరిగాయి. త‌ల దించుకున్నంత ప‌ని అయింది. ఒక ఎంపీని ప‌ట్టుకొని మీ పార్టీకి చెందిన ముఖ్య‌మంత్రి ఇలాంటి మాట‌లు మాట్లాడొచ్చా. మ‌హాభార‌తం, రామ‌య‌ణం, భగ‌వద్గీత‌ నుంచి మ‌నం నేర్చుకున్న‌ది ఇదేనా. హిందు ధర్మాన్ని అడ్డం పెట్టుకొని మీరు ఓట్లు రాల్చుకుంటున్నారు. బీజేపీ అధ్య‌క్షుడినే నేను అడుగుతున్నా. ఇదేనా మీ సంస్కారం. వెంట‌నే అస్సాం ముఖ్య‌మంత్రిని బ‌ర్త‌ర‌ఫ్ చేయండి.. అని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు.

- Advertisement -