- Advertisement -
తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్‌లు మరోసారి భేటీ కానున్నారు. సోమవారం జరిగే ఈ భేటీలో రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న పెండింగ్ సమస్యల పరిష్కారంపై ప్రధానంగా చర్చించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వీరిద్దరి మధ్య మూడుసార్లు భేటీ జరుగగా తాజాగా జరిగే ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.
కృష్ణా గోదావరి నదుల అనుసంధానం ఉమ్మడిగా చేపట్టాలని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ఓ నిర్ణయానికి రాగా దీనికి అయ్యే ఖర్చును రెండు రాష్ట్రాలు భరించాలని అంగీకారానికి వచ్చారు. విభజనకు సంబంధించిన అంశాల విషయంలో రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. విద్యుత్ ఉద్యోగుల విభజన విషయంలో ధర్మాధికారి నిర్ణయానికి తెలంగాణ ప్రభుత్వం అంగీకరించింది. కానీ దీన్ని ఏపీ సర్కార్ తోసిపుచ్చింది. ఈ పరిస్థితుల్లో ఇద్దరు ముఖ్యమంత్రులు భేటీ అవుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.
- Advertisement -