అందుకే జాతీయ పార్టీ పెడుతున్నాం: సీఎం కేసీఆర్

85
cm kcr
- Advertisement -

జాతీయత స్పూర్తి ఉంది కాబట్టే జాతీయ పార్టీ పెడుతున్నామని తెలిపారు సీఎం కేసీఆర్. అసెంబ్లీ వేదికగా బీజేపీ ప్రభుత్వ తీరును ఎండగట్టిన సీఎం…దేశంలో మార్పు రావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. కేంద్రం తప్పుదోరణిలో వెళ్తుంది కాబట్టే మోడీ సర్కార్ విధానాలను ఎండగట్టాల్సి వస్తోందన్నారు. పేరుకే మేకిన్ ఇండియా అంతా చైనా గూడ్సేనని దుయ్యబట్టారు. తెలంగాణ రాష్ట్రాన్ని బాగుచేసుకుంటుంటే కేంద్రం కడుపుమంటతో వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేయడమే లక్ష్యంగా బీజేపీ పెట్టుకుందన్నారు.

ఆర్టీసీని అమ్మేయండి అని లెటర్లు మీద లెటర్లు వస్తు్న్నయ్‌. ఎవరు ముందుగ అమ్మితే వారికి వెయ్యి కోట్ల బహుమానం అంటున్నరు. కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం ఆర్టీసీని అమ్మాలని లెటర్లు పంపాలని ఆర్థికమంత్రి పంపారు. మొత్తం మీద సబ్జెక్ట్‌ ఏంటంటే.. మేం కూడా అమ్ముతున్నం కాబట్టి.. మీరు కూడా అమ్మేయండి అనే పద్ధతిలో వ్యవహరిస్తున్నరు అంటూ మండిపడ్డారు.

మీటర్‌ పెట్టకుండా విద్యుత్‌ కనెన్షన్‌ ఇవ్వొద్దని కేంద్రం తీసుకువచ్చిన గెజిట్‌లోనే ఉన్నది. గెజిట్‌ నిన్నగాక మొన్న వచ్చింది. చట్టంలో లేదు.. మేము అనలేదు అంటున్నరన్నారు. రఘునందన్‌రావు మా బీజేపీ పార్టీ పెట్టదని అంటున్నాడని.. పెట్టేది కేంద్ర ప్రభుత్వం కదా?.. మా పార్టీకి.. ప్రభుత్వానికి ఏమైనా గ్యాప్‌ ఉందా? అని ప్రశ్నించారు. విద్యుత్‌ సంస్కరణలు అని దానికి అందమైన ముసుగు పేరు. ఇది సంస్కరణలు కాదు.. పాడు కాదు. పేద ప్రజలను, కరెంటు వాడే ప్రతి ఒక్కరినీ దోచుకునే ఒక దుర్మార్గం అని చెప్పారు.

- Advertisement -