రాష్ట్రపతి ఎన్నికలకు… ఓటు హక్కును వినియోగించుకున్న సీఎం కేసీఆర్

108
kcr
- Advertisement -

దేశ వ్యాప్తంగా రాష్ట్రపతి ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ క‌మిటీ హాల్‌లో రాష్ట్ర‌ప‌తి ఎన్నిక పోలింగ్ ప్ర‌క్రియ ప్ర‌శాంతంగా కొన‌సాగుతోంది. సోమ‌వారం మ‌ధ్యాహ్నం స‌మ‌యంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. కేసీఆర్‌తో పాటు శాస‌న‌స‌భ స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు ప్ర‌శాంత్ రెడ్డి, ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు కూడా ఓటు వేశారు. విప‌క్షాల అభ్య‌ర్థి య‌శ్వంత్ సిన్హాకు టీఆర్ఎస్ పార్టీ మ‌ద్ద‌తు ఇస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టి వ‌ర‌కు 116 మంది ఎమ్మెల్యేలు ఓటేశారు. ఇంకా మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్, ఎమ్మెల్యే చెన్న‌మ‌నేని ర‌మేశ్‌, కాంగ్రెస్ ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకోలేదు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది. ఈ నెల 21న ఎన్నిక ఫలితాలను ప్రకటిస్తారు.

- Advertisement -