దేశానికే ఆదర్శంగా.. సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీం

32
- Advertisement -

బిడ్డల ఆకలితో వుంటే తల్లి మనసు చలిస్తుంది..తట్టుకోలేదు. అటువంటి తల్లిమనసే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ది. గ్రామాల్లో చదువుకునే పిల్లల్లో ఎక్కువ శాతం బడుగు బలహీన వర్గాల బిడ్డలే. పొద్దున్నే లేచి పొలం పనులు తదితర పనుల్లోకి వెల్లే తల్లిదండ్రులకు పిల్లలను స్కూలుకు పంపించడంలో రోజువారి ఎదుర్కునే సమస్యల పట్ల అవగాహన, ఉదయాన్నే స్కూలుకు వచ్చిన పిల్లలు ఏకారణం చేతకూడా అర్థాకలితో వుండకూడదనే ఆలోచన వున్న ప్రజా ముఖ్యమంత్రి కెసిఆర్.

అంతేకాకుండా, దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటుందని బలంగా నమ్మే దార్శనికుడు. అద్భుతమైన విద్యనందిస్తూ విద్యార్థులకు బుద్ధిబలాన్ని పెంచడం తో పాటు పౌష్టికాహారంతో శారీరక బలాన్ని కూడా పిల్లలకు వృద్ధి చేసేదిశగా వారి ఆలోచనలు రూపుదిద్దుకున్నాయి. ఈ నేపథ్యంలోంచే ప్రతిష్టాత్మకమైన మరో మానవీయ పథకం, “సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీం (ముఖ్యమంత్రి అల్పాహార పథకం)” కు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

పిల్లలకు పుష్టికరమైన ఆహారంతో కడుపు నింపితేనే వారి మనస్సు చదువు పై లగ్నం చేయడంతో పాటు, ఆటపాటల్లో రాణిస్తారని భావించిన సీఎం కేసీఆర్ గారి ఆలోచనతో ఈ పథకం రూపుదాల్చింది.
ఇప్పటికే తల్లీబిడ్డల సంక్షేమం దిశగా పలు పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. తల్లి కడుపులో బిడ్డ ఉన్న దశ నుంచే ఆ బిడ్డ ఆరోగ్యంగా ఎదిగేందుకు కేసీఆర్ కిట్, తల్లీ బిడ్డల ఆరోగ్యం కోసం కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ వంటి పథకాలను అమలు చేస్తున్నది. బిడ్డలు ఎదిగి చదువుకునే దశలో అంగన్ వాడీ విద్యనందిస్తూ వారికి భోజన వసతులను అందిస్తున్నది.

విద్యార్థి దశలో మేధో వికాసమే లక్ష్యంగా పథకాలను తెచ్చింది. మహిళా, శిశు సంక్షేమ శాఖ అమలుచేసే కార్యక్రమాలతో పాటు మధ్యాహ్న భోజనం, బెల్లం కలిపిన రాగిజావ, పదో తరగతి విద్యార్థులకు స్పెషల్ క్లాసుల సమయంలో ఉచితంగా స్నాక్స్ వంటి కార్యక్రమాలను ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్నది. వాటికి కొనసాగింపుగా సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించింది.

పిల్లల్లో విద్యా ప్రమాణాల పెంపు, వారి మేధో సామర్థ్యాలను పెంచేందుకు తొలిమెట్టు, లక్ష్య, ఉన్నతి వంటి కార్యక్రమాలను ప్రారంభించిన ప్రభుత్వం చదువుతో పాటు పౌష్టికాహార లోపాన్ని అధిగమించడం, హాజరును మెరుగుపరచడం, డ్రాపౌట్స్ ను తగ్గించడమే లక్ష్యంగా సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా వారానికి ఆరు రోజుల పాటు విభిన్న రకాల పౌష్టికాహారాన్ని విద్యార్థులకు అల్పాహారంగా అందించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 27,147 ప్రభుత్వ జిల్లా, మండల పరిషత్తు, ఎయిడెడ్, మాడల్ స్కూళ్ళు, మదర్సాలలో చదువుకుంటున్న దాదాపు 23 లక్షల మంది విద్యార్థులకు ఈ పథకం ద్వారా ప్రయోజనం కలుగుతుంది. ఈ పథకం అమలుకు ప్రతి ఏటా రూ. 500 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయనున్నది.

దేశంలో మధ్యాహ్నభోజన పథకాన్ని 1 నుంచి 8 వ తరగతుల వరకు మాత్రమే అమలు చేస్తుండగా తెలంగాణ రాష్ట్రంలో 9, 10 తరగతులకు కూడా విస్తరించి తన మానవీయ కోణాన్ని సీఎం కేసీఆర్ చాటుకున్నారు. దీని కోసం ప్రభుత్వం అదనంగా 137 కోట్లు ఖర్చు చేస్తున్నది. దొడ్డు బియ్యానికి బదులు సన్నబియ్యం, వారానికి మూడు గుడ్లను అదనంగా అందజేస్తున్నది. సన్నబియ్యం కోసం 187 కోట్ల రూపాయలు, గుడ్ల కోసం 120 కోట్ల రూపాయలను ప్రభుత్వం అదనంగా భరిస్తున్నది. విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు మన ఊరు మన బడి వంటి కార్యక్రమాలతో పాటు, క్రీడా సౌకర్యాలు, మౌలిక సౌకర్యాల పెంపు, పాఠశాలల అభివృద్ధి, ఉపాధ్యాయులు, లైబ్రేరియన్, ఫిజికల్ డైరక్టర పోస్టులు, ఇతర సిబ్బంది నియామకం వంటి ఎన్నో చర్యలను ప్రభుత్వం చేపట్టింది. తెలంగాణలో విపరీతంగా విస్తరించిన గురుకులాలు ప్రపంచస్థాయి విద్యనందిస్తూ నేడు దేశానికే ఆదర్శంగా గర్వకారణంగా నిలిచాయి. విద్యబుద్దులు నేర్పే ఉపాధ్యాయుల సంక్షేమం కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది.

*రాష్ట్రవ్యాప్తంగాప్రారంభం..పాల్గొన్న మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నతాధికారులు*

ఇవాళ (6 అక్టోబర్ 2023న) రాష్ట్రవ్యాప్తంగా 1 నుంచి 10వ తరగతి విద్యార్థినీ, విద్యార్థులందరికీ బలవర్ధకమైన బ్రేక్ ఫాస్ట్ (ఉపాహారం)ను అందించే పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది.

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారి ఆదేశాలమేరకు మంత్రులు కెటిఆర్, హరీశ్ రావు సహా రాష్ట్రవ్యాప్తంగా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు,తదితర ప్రజా ప్రతినిధులు జిల్లా కలెక్టర్లు, అధికారులు సిఎం బ్రేక్ ఫాస్ట్ కార్యక్రమాన్ని, ఉత్సాహభరిత వాతావరణంలో, విద్యార్థులు, వారి తల్లిదండ్రుల కోలాహలం నడుమ ఈ పథకాన్ని ప్రారంభించారు. ప్రారంభించారు.

Also Read:ఏక్షణంలోనైనా జంప్.. బీజేపీలో కలవరం!

సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని వెస్ట్ మారేడ్ పల్లి ప్రభుత్వ పాఠశాలలో సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని మంత్రి కేటీఆర్ లాంభనంగా ప్రారంభించారు.
విద్యార్థులతో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేశారు. బ్రేక్ ఫాస్ట్ పోషకాలతో చాలా రుచిగా ఉందని కేటీఆర్ ప్రశంసించారు. సీఎం కేసీఆర్ గారి దార్శనికతే తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామరక్ష అని కేటీఆర్ అన్నారు.

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం రావిర్యాల జిల్లా పరిషత్ స్కూల్ లో సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని,మంత్రి హరీష్ రావు ప్రారంభించారు.
ఈ పథకం విద్యా వ్యవస్థలో సమూల మార్పు తెస్తుందని హరీష్ రావు అన్నారు.

మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, ఎంపీలు పాటిల్, రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు, ఎడ్యుకేషన్‌, వెల్ఫేర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్షర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ రావుల శ్రీధర్‌ రెడ్డి, విద్యా శాఖ సెక్రెటరీ వాకాటి కరుణ తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మం జిల్లా కేంద్రం రోటరీ నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఈ పథకాన్ని ప్రారంభించారు. సీఎం కేసీఆర్ గారి పాలనలో కార్పోరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఆవిర్భవించాయని ఆయన అన్నారు. మేయర్ పునుకొల్లు నీరజ, జిల్లా కలెక్టర్ VP గౌతమ్, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

వికారాబాద్ నియోజకవర్గం శివారెడ్డి పేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంత్రి పట్నం మహేందర్ రెడ్డి సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్, మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బైండ్ల విజయకుమార్, ఎంపీపీ చంద్రకళ తదితరులు మంత్రితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

నిర్మ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలోని సోన్ ప్రాథ‌మిక పాఠ‌శాల‌లో ముఖ్య‌మంత్రి అల్పాహారం ప‌థ‌కాన్ని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. ఆకలి బాధలు లేకుండా పిల్లలు పాఠశాలకు హాజరయ్యేలా చూడడంతో పాటు పోషకాహార స్థితిని మెరుగుపరచడం, పాఠశాలల్లో విద్యార్థులు హాజరు పెంచడం వంటి లక్ష్యాలతో సీఎం కేసీఆర్ దూరదృష్టితో ఈ పథకాన్ని తెచ్చారని కొనియాడారు.

నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వోన్నత ప్రాథమిక పాఠశాలలో “సీఎం బ్రేక్ ఫాస్ట్” కార్యక్రమాన్ని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. కేసిఆర్ జనరంజక పాలనలో భాగంగా మానవీయ కోణంలో ఎన్నో పథకాలు ప్రవేశ పెట్టారని అన్నారు. పేదవారు కూడా ప్రపంచంతో పోటీ పడేలా కేసీఆర్ గార విద్యారంగాన్ని తీర్చిదిద్దుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో వినోద్,జిల్లా విద్యాధికారి,స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు,స్కూల్ హెచ్.ఎం ,టీచర్లు,విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

అమీర్ పేట్ డికె రోడ్డులోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ముఖ్యమంత్రి అల్పాహారం పథకాన్ని మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, హోంమంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న కార్యాచరణతో పాఠశాలల రూపురేఖలు, విద్యార్థుల సామర్థ్యం మెరుగుపడుతున్నాయని మంత్రులు తెలిపారు.

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని మోడల్ బేసిక్ ఉన్నత పాఠశాలలో “ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని” మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని తరగతుల విద్యార్థులకు అల్పాహారంతో పాటు, మధ్యాహ్న భోజన పథకాన్ని అందిస్తున్న రాష్ట్రం దేశంలో ఎక్కడా లేదని అన్నారు.

కరీంనగర్ జిల్లా రూరల్ మండలంలోని మొగ్దూంపూర్ గ్రామంలోని జడ్పిహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాలలో జిల్లా కలెక్టర్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ లతో కలిసి సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు చదువు పై ఏకాగ్రతను పెంచే బలవర్ధకమైన పౌష్టికాహారాన్ని అందించే దిశగా సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని మంత్రి అన్నారు.

సూర్యాపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని మంత్రి జగదీష్ రెడ్డి ప్రారంభించారు. సిఎం బ్రేక్ ఫాస్ట్ పథకంలో విద్యావ్యవస్థలో సమూల మార్పులు రానున్నాయని, విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పు కు బలవర్ధకమైన బ్రేక్ ఫాస్ట్ పథకం నాంది పలకనుందని మంత్రి తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపి బడుగుల లింగయ్య యాదవ్, జిల్లా కలెక్టర్ యస్. వెంకట్రావు, అదనపు కలెక్టర్ సి.హెచ్. ప్రియాంక, డి.ఈ.ఓ అశోక్, మున్సిపల్ చైర్మన్ పెరుమల్ల అన్నపూర్ణ శ్రీనివాస్, కమీషనర్ రామానుజుల రెడ్డి, వైస్ చైర్మన్ పుట్టా కిషోర్, తహసీల్దార్ శ్యామ్ సుందర్ రెడ్డి, అధ్యాపకులు

హన్మకొండ లష్కర్ బజార్ లోని ప్రభుత్వ పాఠశాలలో ముఖ్యమంత్రి అల్పాహారం పథకాన్ని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ కలిసి ప్రారంభించారు. పేద విద్యార్థుల కడుపు నింపాలన్న గొప్ప సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన సీఎం బ్రేక్‌ఫాస్ట్‌ పథకం అద్భుతం మంత్రి ఎర్రబెల్లి కొనియాడారు. పేద విద్యార్థుల కడుపు నింపాలన్న గొప్ప సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన సీఎం బ్రేక్‌ఫాస్ట్‌ పథకం అద్భుతంమని మంత్రి సత్యవతి అన్నారు.

బాన్సువాడ నియోజకవర్గంలోని జక్కలదాని తాండా (జెకే తాండా) ప్రాథమిక పాఠశాలలో “ముఖ్యమంత్రి అల్పాహారం” పథకాన్ని తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి శ్రీ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ పథకాన్ని ప్రారంభించినందుకుగాను ముఖ్యమంత్రి గారికి స్పీకర్ ధన్యవాదాలు తెలిపారు.

సికింద్రాబాద్ పరిధిలోని అడ్డగుట్ట ప్రభుత్వ స్కూల్ లో సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ప్రారంభించారు. కార్పొరేటర్ లింగాని ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్, డిప్యూటీ కమీషనర్ సుధాంశు, ఇంజినీర్ ఆశా లతా, ప్రిన్సిపాల్ మధుసూదన్ రెడ్డి, విద్యాధికారులు, నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Also Read:KTR:త్వరలో మళ్లీ పెన్షన్ పెంపు

సిఎం కేసీఆర్ కు కృతజ్జతలు
పిల్లల్లో హర్షాతిరేకాలు
సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకం అమలుతో రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థినీ, విద్యార్థుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. విద్యార్థినీ,విద్యార్థుల తల్లిదండ్రులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని, తెలంగాణ ప్రభుత్వాన్ని నిండు మనసుతో కృతజ్జతలు తెలిపుకున్నారు. తమకోసం తెలంగాణ ప్రభుత్వం విద్యారంగంలో చేపడుతున్న విప్లవాత్మక సంస్కరణలతో తెలంగాణ విద్యారంగం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని స్పష్టం చేశారు.

- Advertisement -