రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు పుట్టిన రోజు శుభాకాంక్షాలు తెలియజేశారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రాష్ట్రపతి భవన్‌కు ప్రత్యేక సందేశం పంపించారు. రాష్ట్రపతిగా కోవింద్ దేశానికి మరింత సేవ చేయాలని సీఎం ఆకాంక్షించారు. రాష్ట్రపతి కోవింద్ పరిపూర్ణ ఆరోగ్యంతో, నిండునూరేళ్లు జీవించాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నట్లు సీఎం సందేశంలో తెలిపారు.
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్ కూడా రాష్ట్రపతికి జన్మదిన శుభాకాంక్షాలు తెలిపారు. భవిష్యత్ భారత దేశానికి మార్గనిర్దేశం చేసేందుకు గాను దేవుడు వారికి సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించి మరెన్నో సంతోషకరమైన పుట్టినరోజులు జరుపుకోవాలని ప్రార్ధిస్తున్నట్లు ట్వీట్ చేశారు.
భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీ రామ్నాథ్ కోవింద్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. భవిష్యత్ భారత దేశానికి మార్గనిర్దేశం చేసేందుకు గాను దేవుడు వారికి సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించి మరెన్నో సంతోషకరమైన పుట్టినరోజులు జరుపుకోవాలని ప్రార్థన.
— Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) October 1, 2019