తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కోలేటి దామోదర్ గారి రెండవ కూతురు వివాహం సికింద్రాబాద్ లోని క్లాసిక్ గార్డెన్స్ లో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ , తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ హాజరయ్యి నూతన వధూవరులను ఆశిర్వదించారు.
సీఎం కేసీఆర్ తో పాటు హోం మంత్రి మహముద్ అలీ, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు , శేరి సుభాష్ రెడ్డి గారు , మాజీ ఎంపీ వినోద్ కుమార్ మంత్రులు కొప్పుల ఈశ్వర్, మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎస్.కే. జోషి ఐ.ఎ.ఎస్., డి.జి.పి. శ్రీ ఎం. మహేందర్ రెడ్డి, సినీ ప్రముఖులు, అన్ని రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖ నాయకులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి వధూవరులను ఆశీర్వదించారు. అతిధుల రాకతో క్లాస్సిక్ గార్డెన్స్ కిక్కిరిసిపోయింది.