కే‌సి‌ఆర్ జోరు.. బి‌ఆర్‌ఎస్ స్పీడు!

42
- Advertisement -

తెలంగాణ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అధికార బి‌ఆర్‌ఎస్ పార్టీ దూకుడు ప్రత్యర్థి పార్టీలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. అందరికంటే ముందే బరిలో నిలిచే అభ్యర్థులను ప్రకటించిన బి‌ఆర్‌ఎస్ అధినేత కే‌సి‌ఆర్.. ప్రస్తుతం ప్రచారంలో కూడా జట్ స్పీడ్ లో దూసుకుపోతున్నారు. ఒకవైపు కాంగ్రెస్ బీజేపీ పార్టీలు అభ్యర్థుల విషయంలోనూ, ప్రచార విభాగంలోనూ కన్యూజన్ లో కొట్టుమిట్టాడుతుంటే.. బి‌ఆర్‌ఎస్ పార్టీ మాత్రం ఏ కన్ఫ్యూజన్ లేకుండా ప్రజల్లోకి వెళుతూ ప్రచారంలో దూసుకుపోతుంది. తొలి విడతలో భాగంగా ఈ నెల 15 నుంచి 18 వరకు ఆయా నియోజిక వర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేసిన ముఖ్యమంత్రి కే‌సి‌ఆర్.. జరిగిన అభివృద్దిని ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుతున్నారు.

దసరా తరువాత రెండో విడత ప్రచారాన్ని స్టార్ట్ చేసిన అధినేత రెండు రోజుల్లో ఆరు నియోజిక వర్గాల్లో ప్రచారం సాగించి ప్రజల్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు. ఇక నేటి నుంచి వచ్చే నెల 9 వరకు మళ్ళీ నాన్ స్టాప్ ప్రచారంతో ఉమ్మడి నల్గొండ జిల్లాల్లోని ఆయా నియోజిక వర్గాల్లో పర్యటించనున్నారు కే‌సి‌ఆర్. అధినేత జట్ స్పీడ్ ప్రచారంతో అటు పార్టీ నేతల్లోనూ ఇటు ప్రజల్లోనూ కొత్త ఉత్సాహం నెలకొంది. వచ్చే ఎన్నికల్లో 100 పైగా సీట్లు సాధించే దిశగా బి‌ఆర్‌ఎస్ దూకుడుగా వ్యవహరిస్తుండడంతో ప్రత్యర్థి పార్టీలు బి‌ఆర్‌ఎస్ స్పీడ్ ను అందుకోవడంలో వెనకబడినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్, బీజేపీ పార్టీలలో అంతర్గత కుమ్ములాటలు, సీట్ల కేటాయింపు వివాదాలు గట్టిగా నడుస్తుండడంతో ఈ రెండు పార్టీలు గాడిన పడడం అంతా తేలికైన విషయం కాదు. మొత్తానికి బి‌ఆర్‌ఎస్ జోరు ముందు ఈ రెండు పార్టీల తేలిపోయాయనే చెప్పాలి.

Also Read:చలికాలంలో ఇవి తింటున్నారా?

- Advertisement -