బీజేపీ ” బీసీ “మంత్రం!

30
- Advertisement -

తెలంగాణలో బీజేపీ బలపడేందుకు గత కొన్నాళ్లుగా గట్టి ప్రయత్నలు చేస్తోంది. కానీ అనుకున్నాట్లుగా పార్టీకి మైలేజ్ రావడం లేదు. దానికి తోడు ఈ మద్య కాలంలో పార్టీలో అంతర్గత విభేదాలు కూడా చాలా పెరిగిపోయాయి. ఈ కారణంగానే పార్టీలోని కీలక నేతలు కూడా ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. కాగా మరోవైపు ఎన్నికలు దగ్గర పడడంతో పార్టీ పరిస్థితి ఇలాగే కొనసాగితే.. తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందనే భయం కూడా నేతల్లో ఉంది. అందుకే ఇటీవల హడావిడిగా బరిలో నిలిచే మొదటి అభ్యర్థుల జాబితాను కూడా ప్రకటించింది కాషాయ పార్టీ. ఇక త్వరలోనే రెండో లిస్ట్ కూడా ప్రకటించే అవకాశం ఉంది.

ఇంతవరకు బాగానే ఉన్నప్పటికి ప్రజలకు దగ్గరయ్యేందుకు బీజేపీ ఎలాంటి ప్రణాళికలు రచించబోతుంది. అమలు చేసే వ్యూహాలు ఏంటి అనే దానిపై ఆసక్తికరమైన చర్చలు నడుస్తున్నాయి. ఇటీవల తెలంగాణకు వచ్చిన అమిత్ షా.. బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ అభ్యర్థిని సి‌ఎంగా ప్రకటిస్తామని చెప్పుకొచ్చారు. దీంతో సొంత పార్టీలోనే గందరగోళం నెలకొంది.. ప్రస్తుతం పార్టీ తరుపున బండి సంజయ్, కిషన్ రెడ్డి వంటివారు సి‌ఎం అభ్యర్థి రేస్ లో ముందున్నరు. మరి వీరిద్దరిలో ఎవరో ఒకరిని సి‌ఎం అభ్యర్థిగా ప్రకటిస్తారా లేదా వేరే వారికి ఛాన్స్ ఇస్తారా అనేది చూడాలి.

ఇకపోతే రాష్ట్రంలో బీసీ ఓటు బ్యాంక్ అత్యంత కీలకం. ఏ పార్టీ అయిన అధికారంలోకి రావాలంటే బీసీ ఓటర్లే కీలక పాత్ర పోషిస్తారు. అందుకే అటు కాంగ్రెస్ గాని, ఇటు బీజేపీ గాని బీసీల పై కపట ప్రేమ కురిపిస్తూ.. ఎన్నికల ముందు ఆ సామాజిక వర్గాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే బి‌ఆర్‌ఎస్ అధికారం చేపట్టిన తరువాత బీసీ సంక్షేమనికి కే‌సి‌ఆర్ సర్కార్ బాటలు వేసింది. దాంతో బీసీ సామాజిక వర్గం మొత్తం.. బి‌ఆర్‌ఎస్ వెంటే ఉంది. ఈ నేపథ్యంలో బీసీ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఎన్ని ప్రయత్నలు చేసిన వ్యర్థమే అని విశ్లేషకులు చెబుతున్నారు.

Also Read:మహేష్ బాబును లెక్క చేయట్లేదా?

- Advertisement -