సినారే అంత్యక్రియల్లో పాల్గొన్న కేసీఆర్

238
- Advertisement -

జ్ఞానపీఠ్‌ అవార్డు గ్రహీత సి.నారాయణరెడ్డి అంత్యక్రియలు ముగిసాయి.. సీఎం కేసీఆర్ దగ్గరుండి ఏర్పాట్లు చూశారు. మహాప్రస్థానంలోకి సినారె భౌతికకాయం ప్రవేశించినప్పటి నుంచి వెంటే నడిచారు సీఎం.  పుష్పగుచ్ఛం సినారెకి నివాళులర్పించారు సీఎం. సినారె అంతిమ సంస్కార క్ర‌తువును ఆయ‌న మ‌న‌వడు చైత‌న్యదేవ్ నిర్వ‌హించాడు. అనంతరం ప్రభుత్వ లాంఛనాలతో సినారె అంత్యక్రియలు నిర్వహించారు. సినారె అంత్యక్రియల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు పలువురు మంత్రులు కూడా పాల్గొన్నారు.

KCR at CNR

ఉదయం ఆయన భౌతికకాయాన్ని బొగ్గులకుంటలోని సారస్వత్‌ పరిషత్‌కు తరలించారు. అక్కడ సాహితీవేత్తలు, కవులు, భాషాభిమానులు సినారె భౌతికకాయానికి నివాళులర్పించారు. అనంతరం ఆయన అంతిమయాత్ర అబిడ్స్‌, నాంపల్లి, లక్డీకాపూల్‌, టోలిచౌకి మీదుగా జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానం వరకు సాగింది. కడసారి సీనారేకు నివాళులు అర్పించడానికి భారీ ఎత్తున అభిమానులు, రాజకీయ ప్రముఖులు మహాప్రస్థానానికి చేరుకున్నారు.

- Advertisement -