వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన మహిళా క్రికెటర్‌గా హైదరాబాదీ మిథాలీ రాజ్ నిలిచింది. ఇన్నాళ్లూ 5992 రన్స్‌తో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఎడ్వర్డ్స్ పేరిట ఉన్న రికార్డు బద్ధలైంది. మ్యాచ్‌కు ముందు 5959 పరుగులతో రెండో స్థానంలో ఉన్న మిథాలీ.. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో ఆ రికార్డును బ్రేక్ చేసింది. 183 వన్డేల్లో వన్డేల్లో 6 వేల పరుగులు చేసిన తొలి మహిళగా ఆమె అవతరించింది. ఈ సంధర్బంగా మిథాలీ రాజ్ ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అభినందించారు. ఈ మేరకు ఆమెకు అభినందన సందేశం పంపారు. భారత జట్టు సారథిగా, వ్యక్తిగతంగా మిథాలీ రాజ్ మరిన్ని విజయాలు సాధించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ గా మిథాలీరాజ్, అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా జులన్ గోస్వామి.. ఇద్దరూ భారతీయులే కావడం గర్వంగా ఉందని సిఎం అన్నారు.
వుమెన్ వరల్డ్ కప్ లో మిథాలీ రాజ్ నాయకత్వంలో భారతజట్టు ఘన విజయం సాధించాలని సిఎం ఆకాంక్ష వ్యక్తం చేశారు. గతంలో టెస్టు క్రికెట్లో రికార్డ్ సాధించిన గవాస్కర్ – కపిల్ దేవ్ కూడా ఇలా ఒకేసారి అగ్రగాములుగా నిలిచిన సంఘటనను ఈ ఇద్దరు అమ్మాయిలు పునరావృతం చేశారని సిఎం గుర్తుచేశారు.