స్పైడర్‌ సెట్‌లో సరదా సన్నివేశం..!

213
Mahesh Babu funniest moment with Assistant director
Mahesh Babu funniest moment with Assistant director
- Advertisement -

మహేష్ బాబు, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా మురుగదాస్ దర్శకత్వంలో ‘స్పైడర్’ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా బ్యాలన్స్ షూటింగ్ జరుగుతోంది. ‘స్పైడర్’ కోసం చాలా మంది అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం సెట్ లో చోటుచేసుకున్న ఓ సరదా సన్నివేశం చోటు చేసుకుంది. ‘స్పైడర్ సెట్ లో అసిస్టెంట్ డైరెక్టర్ తో మహేశ్ బాబు సరదా సన్నివేశం’ అంటూ పోస్ట్ చేసిన ఈ వీడియోలో, అసిస్టెంట్ డైరెక్టర్ బుగ్గలను తన రెండు చేతులతో పట్టుకున్న మహేశ్ కడుపుబ్బేలా నవ్వుతూ సరదాగా కామెంట్ చేయడం కనపడుతుంది. ఈ వీడియోను మురుగదాస్ తన ఫేస్ బుక్ ఖాతాలో ఈరోజు పోస్ట్ చేశారు. ఈ వీడియోలో చిత్ర యూనిట్ సభ్యుల కామెంట్లు కూడా వినపడుతుండటం గమనార్హం.

మహేష్‌ బాబు – మురుగదాస్ కాంబినేషన్ లో మేకింగ్ లో ఉన్న స్పైడర్ మూవీపై ఇప్పటికే హై రేంజ్ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే మురుగదాస్ కేర్ తీసుకుని, ఫ్యాన్స్ అంచనాలకు అనుగుణంగా పిక్చర్ ను తీస్తున్నాడు. ఈమధ్యనే స్పైడర్ టీజర్ కూడా రిలీజ్ చేశారు. టీజర్ ను చూసిన వారికి .. ఈ సినిమా ఏ స్థాయిలో ఉంటుందో తెలిసిపోయింది. ఈ సినిమాను దసరాకి విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.

- Advertisement -