వారి కృషికి అభినందనలు- సీఎం కేసీఆర్‌

93
- Advertisement -

హరిత హారం, గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా 73,918 సీడ్ బాల్స్‌తో అతి పెద్ద సీడ్ బాల్ సెంటెన్స్ కి గాను గిన్నిస్ రికార్డ్ వరించినందుకు మహబూబ్ నగర్ జిల్లా యంత్రాంగాన్ని,పాలమూరు మహిళా సమాఖ్య కృషిని ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. మహబూబ్ నగర్ జిల్లా స్వయం సహాయక బృందాలు గత ఏడాది చేసిన 1.18 కోట్ల సీడ్ బాల్స్ రికార్డ్‌ను అధిగమించి కేవలం 10 రోజుల్లో 2.08 కోట్ల సీడ్ బాల్స్ తయారు చేసి రికార్డ్ స్పృష్టించారు. ఈ నేపథ్యంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్‌,ఎంపీ సంతోష్‌ కుమార్‌లు ఈరోజు ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా వారిని సీఎం అభినందించారు.

- Advertisement -