మ‌రో రెండు కొత్త జిల్లాల‌కు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్న‌ల్

215
kcr new
- Advertisement -

రాష్ట్ర అభివృద్దే ల‌క్ష్యంగా ప‌రిపాల‌న‌లో  నూత‌న ఒర‌వ‌డికి శ్రీకారం చుట్టారు సీఎం కేసీఆర్. 2014లో మొద‌టి సారి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత 10జిల్లాలు ఉన్న రాష్ట్రాన్ని 31జిల్లాలుగా మార్చారు. ప్రజా ప్ర‌తినిధులు, అధికారులు ప్ర‌జ‌ల‌కు ఎల్ల‌ప్పుడూ అందుబాటులో ఉండేందుకు కొత్త జిల్లాల‌ను ఏర్పాటుచేశామ‌ని చెప్పారు సీఎం కేసీఆర్. ఈసంద‌ర్భంగా కొన్ని తండాల‌ను గ్రామ‌పంచాయితీలుగా మార్చి గిరిజిన‌, లంబాడ సోద‌రీ, సోద‌రీమ‌నుల‌కు రాజ‌కీయంగా ఎదిగేందుకు అవ‌కాశం కల్పించారు.

Kcr meeting

ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామిల‌ను ప్ర‌మాణ‌స్వీకారం చేసిన మూడురోజుల‌కే నెర‌వేర్చారు. ములుగు, నారాయ‌ణ పేట్ ల‌ను జిల్లాలుగా ప్ర‌క‌టించిన సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. నిన్న సాయంత్రం ప్రగతి భవన్ లో పంచాయతీ రాజ్ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన ఈ మేరకు ఆదేశించారు.

kcr

గ్రామాలు బాగుంటేనే రాష్ట్రాలు, దేశం బాగుంటాయని ఈ సందర్భంగా కేసీఆర్ అన్నారు. ప్రతి పంచాయతీకి ఒక కార్యదర్శిని నియమించాలని చెప్పారు. పంచాయతీ ఎన్నికలు పూర్తైన వెంటనే గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రతను పెంచే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని అధికారుల‌కు పిలుపునిచ్చారు సీఎం కేసీఆర్.

- Advertisement -