ఎంపీ ప‌ద‌వికి బాల్క సుమ‌న్ రాజీనామా..

246
balkasuman resign to mp
- Advertisement -

పెద్దపల్లి టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ తన పదవికి రాజీనామా చేశారు. 2014ఎన్నిక‌ల్లో ఆయ‌న పెద్ద‌ప‌ల్లి పార్ల‌మెంట్ స్దానం నుంచి పోటీ చేసి గెలుపోందారు. అయితే ఇటివ‌లే రాష్ట్రంలో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో సుమ‌న్ చెన్నూర్ అసెంబ్లీ స్ధానం నుంచి పోటీ చేసి 26,849ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

balkasuman

తన రాజీనామా లేఖను స్పీకర్ సుమిత్రా మహాజన్ కు సుమన్ అందజేశారు. ఆయ‌న‌తో పాటు ఎంపీలు జీతెంద‌ర్ రెడ్డి, బూర న‌ర్స‌య్య గౌడ్, వినోద్ కుమార్ ప‌లువురు స్పీక‌ర్ ను క‌లిశారు. మ‌ల్కాజ్ గిరి ఎంపీ మ‌ల్లారెడ్డి కూడా ఇటివ‌లే త‌న ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేసిన విష‌యం తెలిసిందే. మేడ్చ‌ల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు.

- Advertisement -