ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు పక్షపాతి అన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. నల్గొండ జిల్లా హాలియలో జరిగిన హాలియ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణస్వీకారం కార్యక్రమంలో ఎమ్మెల్యే నోముల నర్సింహాయ్య, ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డితో కలిసి పాల్గొన్నారు జగదీష్ రెడ్డి.
ఈ సందర్భంగా మాట్లాడిన జగదీష్ రెడ్డి…లక్ష రూపాయల రుణమాఫీ తో రైతు శ్రేయస్సు మొదలైందన్నారు. రైతుబందు,రైతు భీమా ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పానికి దిక్సూచిగా నిలిచాయని చెప్పారు.
నీటిపారుదల రంగంతో పాటు విద్యుత్ రంగంలో సగం బడ్జెట్ వ్యవసాయ రంగానికే కేటాయించారని చెప్పారు. సమైక్య పాలనలో వ్యవసాయ రంగాన్ని నాశనం చేశారు…విత్తనాలు,ఎరువులు,విద్యుత్ కోతలతో వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టారని మండిపడ్డారు.
తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయాన్ని పండుగ గా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దే అన్నారు. రైతుల డిమాండ్ మేరకే రబీకి నీటి విడుదల చేశామని వారాంతంలో ఆయకట్టు రైతాంగం ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తామన్నారు.
CM KCR Aim is Farmers welfare says minister jagadeesh reddy. CM KCR Aim is Farmers welfare says minister jagadeesh reddy.