- Advertisement -
కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పసలేని,పనికిమాలిన బడ్జెట్ అన్నారు సీఎం కేసీఆర్. నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై స్పందించిన సీఎం కేసీఆర్…అన్నివర్గాలను ఈ బడ్జెట్ తీవ్రంగా నిరాశపర్చిందన్నారు.
నిర్మలా సీతారామన్ చదివి వినిపించిన బడ్జెట్ ప్రసంగం ఆసాంతం డొల్లతనంతో నిండి… మాటల గారడీ అని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు, రైతులకు, పేదలకు, సామాన్యులకు, కుల వృత్తుల వారిని కూడా ఈ బడ్జెట్ నిరాశకు గురి చేసిందన్నారు.
ఉద్యోగులు పెట్టుకున్న ఆశలపై ఈ బడ్జెట్ నీళ్లు చల్లిందని… వేతన జీవుల కోసం ఇంకమ్‌ట్యాక్స్ శ్లాబులలో మార్పులు చేయకపోవడం విచారకరమన్నారు. దశ, దిశ, నిర్దేశం లేని ఈ బడ్జెట్‌తో ఉపయోగం ఏమీ లేదన్నారు. బడ్జెట్ చాలా గొప్పగా ఉందంటూ కేంద్ర ప్రభుత్వం తమ జబ్బలు తామే చరుచుకుంటోందని కేసీఆర్ ఎద్దేవా చేశారు.
- Advertisement -