వీఆర్వో వ్యవస్థ రద్దు…రెవెన్యూశాఖ యథాతథం

197
kcr
- Advertisement -

తెలంగాణలో వీఆర్వో వ్యవస్థను మాత్రమే రద్దు చేస్తున్నాం….రెవెన్యూ శాఖ యథతథంగా ఉంటుందని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్. కొత్త రెవెన్యూ చట్టంపై శాసనసభలో చర్చ సందర్భంగా భట్టి విక్రమార్క చేసిన సూచనకు రిప్లై ఇచ్చిన సీఎం…రాష్ట్రంలో కేవలం వీఆర్వో వ్యవస్థ మాత్రమే రద్దవుతుందన్నారు.

మిగ‌తా రెవెన్యూ డిపార్ట్‌మెంట్ య‌థాత‌థంగా ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. ఇప్పుడున్న వీఆర్‌వో వ్య‌వ‌స్థ అరాచకాల‌కు పాల్ప‌డుతుంది. అందుకే ర‌ద్దు చేశామ‌న్నారు.కాంగ్రెస్ ప్ర‌భుత్వం మాదిరి అసైన్డ్‌ భూముల‌ను తీసుకోవ‌డం లేదు. కేవ‌లం ప్రాజెక్టులు, ప్ర‌జా ప్ర‌యోజ‌నాల నిమిత్త‌మే ప్ర‌భుత్వం భూముల‌ను తీసుకుంటున్న‌ద‌ని సీఎం తెలిపారు.

ఇక రెవెన్యూ విభాగంలో అన్ని రికార్డులు ఉంటాయి. స‌ర్వే సెటిల్‌మెంట్ వ్య‌వ‌స్థ కూడా ఉంటుంద‌న్నారు. ఎవ‌రూ కూడా ఇబ్బంది ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని సీఎం స్ప‌ష్టం చేశారు. ప్ర‌జా అవ‌స‌రాల‌కు మాత్ర‌మే అసైన్డ్ భూముల‌ను తీసుకుంటున్నారు.

- Advertisement -