కౌశిక్ రెడ్డికి ఉజ్వల భవిష్యత్‌: సీఎం కేసీఆర్

173
kcr cm
- Advertisement -

సీఎం కేసీఆర్ సమక్షంలో తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్‌లో చేరారు టీపీసీసీ మాజీ కార్యదర్శి పాడి కౌశిక్ రెడ్డి. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం…పార్టీలో చేరిన కౌశిక్‌కు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని స్పష్టం చేశారు. ఆయన వెంట వచ్చిన వారికి సముచిత ప్రాధాన్యం కల్పిస్తామని తెలిపారు కేసీఆర్.

దేవుడు నోరు ఇచ్చాడని కుక్కలు మోరిగినట్టు మొరుగుతారా..? ఎన్నికలతో సంబంధం లేకుండా మేము అభివృద్ధి చేస్తూ మేము వెళ్తున్నాం.. అన్ని ఎన్నికల్లో ప్రజలు మమ్మల్ని గెలిపిస్తున్నారని చెప్పారు. దేశంలో దళితులు అణచివేతకు గురయ్యారు….. దళితుల అభివృద్ధి కోసం తెచ్చిన పథకం చూసి కొంత మంది బ్లెడ్ ప్రెషర్ పెరుగుతుందని మండిపడ్డారు.

తెలంగాణ సాధన కోసం చాలా మంది పనిచేశారు.. 1969 ఉద్యమంలో 400 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. చెన్నారెడ్డి ఎలాంటి కమ్యూనికేషన్ లేకపోయినా ఉద్యమాన్ని నడిపారు. కానీ అప్పటి పాలకులు తెలంగాణ ఏర్పాటు చేయలేకపోయారని తెలిపిన సీఎం.. ఇది రాచరిక వ్యవస్థ కాదు..ఎప్పుడు ఒకరే అధికారంలో ఉండరు. కానీ మన కంట్రిబ్యూషన్ ఉంటుందని చెప్పుకొచ్చారు.

గొర్రెల పంపిణీ స్కిం ఉత్త స్కిం కాదు.. ప్రతి పథకం వెనుక లోతైన విశ్లేషణ ఉంది. గొర్రెల ఉత్పత్తి లో దేశంలోనే తెలంగాణ టాప్ ప్లేస్‌లో ఉందన్నారు. రైతు బంధు వల్ల రైతు ఇప్పుడు ధీమాతో ఉన్నాడని…ప్రతి మనిషి చిరునవ్వుతో బ్రతకాలన్నదే తమ అభిమతమన్నారు.

- Advertisement -