వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లపై సీఎం ఉన్నతస్ధాయి సమీక్ష..

250
kcr
- Advertisement -

వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. శనివారం ప్రగతి భవన్‌లో జరుగనున్న ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌తో పాటు రెవెన్యూ ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.

వ్యసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై అధికారులతో చర్చించనున్నారు. హైకోర్టు నిర్ణయంపై సుప్రీం కోర్టుకు వెళ్లడమా? లేదంటే తగు విధమైన విధివిధానాలు రూపొందించి రిజిస్ట్రేషన్ల ప్రక్రియను చేపట్టడమా? అనే అంశంపై రెవెన్యూ, న్యాయ శాఖల నిపుణులతో చర్చించి సీఎం తుది నిర్ణయం తీసుకోనున్నారు.

- Advertisement -