జనతా కర్ఫ్యూలో పాల్గొందాం..సీఎం కేసీఆర్‌ పిలుపు

192
cm kcr
- Advertisement -

ఆదివారం జనతా కర్ఫ్యూలో స్వచ్ఛందంగా పాల్గొందామని ప్రజలకు పిలుపునిచ్చారు సీఎం కేసీఆర్. కార్యక్రమం విజయవంతానికి చేపట్టాల్సిన ఏర్పాట్లు, కార్యాచరణపై కలెక్టర్లు, పోలీసు, వైద్యారోగ్యశాఖ తదితర ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను ఆదేశించారు.

కరోనా కట్టడికి రాష్ట్రంలో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామని వెల్లడించారు. కరోనాపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాని మోడీకి వివరించారు. కరోనా మహమ్మారిని దేశం నుంచి తరిమికొట్టేందుకు కేంద్రానికి పూర్తిగా సహకరిస్తామని తెలిపారు. విదేశాలనుంచి వచ్చినవారి ద్వారానే వైరస్‌ ప్రబలుతున్నదని పేర్కొంటూ..అంతర్జాతీయ విమానాల రాకపోకలను కొన్నిరోజులపాటు పూర్తిగా నిలిపివేయాలని సూచించారు.

దేశంలో అతిపెద్ద నగరాలైన ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌కు విదేశాల నుంచి ప్రయాణికులు భారీసంఖ్యలో వస్తుంటారని.. క్షుణ్ణంగా పరీక్షించాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు. జనసమ్మర్ధం అధికంగా ఉండే ఈ నగరాలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించి, చర్యలు తీసుకోవాలని కోరారు.

- Advertisement -