వారి ఖాతాల్లో రూ.285 కోట్లు జమ చేయనున్న సీఎం జగన్‌..

64
- Advertisement -

ఈ నెల 8న ఏపీలోని దర్జీలు, రజకులు, నాయీ బ్రాహ్మణులకు సీఎం జగన్‌ రూ.285 కోట్లు నిధులు విడుదల చేయనున్నారు. వీరి కోసం ఏటా జగనన్న ‘చేదోడు పథకం’ కింద నిధులు విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాదికి సంబంధించి నిధులను ఈనెల 8న సీఎం జగన్ విడుదల చేయనున్నారు. ఒక్క బటన్ క్లిక్ చేసి దర్జీలు, రజకులు, నాయీ బ్రాహ్మణుల ఖాతాల్లో రూ.10 వేల చొప్పున జమ చేయనున్నారు. ఈ మేరకు మొత్తం రూ.285 కోట్లు విడుదల చేయనున్నారు. కాగా, ఈ ఏడాది జగనన్న చేదోడు పథకం కింద షాపులు కలిగి ఉన్న 1.46 లక్షల మంది దర్జీలు , 98 వేల మంది రజకులు, 40 వేల మంది నాయీ బ్రాహ్మణులకు లబ్ది చేకూరనుంది.

- Advertisement -