ఏపీ శాసన మండలి రద్దు

313
jagan
- Advertisement -

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. శాసనమండలిని రద్దు చేస్తూ ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీంతో కెబినెట్ తీర్మానాన్ని కాసేపట్లో అసెంబ్లీలో ప్రవేశపెట్టే తీర్మానాన్ని కేబినెట్ ఆమెదించింది. కాగా ఈ తీర్మానంపై అసెంబ్లీలో చర్చ జరుగనుంది. రాజ్యాంగ అధికరణ 169(1) ప్రకారం రద్దు ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని తెలుస్తోంది. శాసనసభలో తీర్మానం పెట్టిన అనంతరం తీర్మానం ప్రతిని కేంద్రానికి పంపనున్నారు. కాగా వికేంద్రికరణ బిల్లు, సీఆర్డీఏ చట్టం రద్దుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది.

అయితే శాసన మండలిలో మాత్రం ఈ బిల్లులను సెలక్ట్ కమిటికి పంపాలని మండలి చైర్మన్ షరీఫ్ నిర్ణయించారు. దీంతో విసుగుచెందిన సీఎం జగన్ మండలిని రద్దు చేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. శాసనమండలిలో టీడీపీ సభ్యులు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో ఈ బిల్లులకు శాసనమండలి ఆమోదం తెలుపలేదు. శాసన మండలి రద్దు అయితే 40మంది ఎమ్మెల్సీలు రాజీనామా చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం మంత్రులుగా ఉన్నా పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలు కూడా రాజీనామా చేయాల్సి ఉంటుంది.

- Advertisement -