ఎన్ పీఆర్ పై సంచలన ప్రకటన చేసిన ఏపీ సీఎం

362
jagan
- Advertisement -

ఎన్ పీఆర్ పై సంచలన ట్వీట్ చేశారు ఏపీ సీఎం జగన్. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఎన్పీఆర్ అంశంపై సభలో తీర్మానం చేస్తామని ప్రకటించారు. ‘ఎన్‌పీఆర్‌లో ప్రతిపాదించిన కొన్ని ప్రశ్నలు ఏపీలోని మైనార్టీల్లో అభద్రతా భావాన్ని కలుగజేస్తున్నాయి. ఈ అంశంపై పార్టీలో విస్తృతంగా చర్చించాం.

2010లోని నిబంధనలనే ఇప్పుడు కూడా పాటించాలని కోరతాం. మైనార్టీల మనోభావాలకు అనుగుణంగా అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేస్తాం. అవసరమైన మేరకు కొన్ని మార్పులు చేయాలని కేంద్రాన్ని కోరుతామని’ జగన్‌ ట్వీట్‌ చేశారు. ఎన్పీఆర్ పై ట్వీట్టర్ ద్వారా స్పందించిన జగన్ ఎన్ఆర్సీ,, సీఏఏ పై ఎటువంటి ప్రకటన చేయలేదు.

- Advertisement -