ఎట్టకేలకు ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ కూటమికి మార్గం సుముఖం అయిన సంగతి తెలిసిందే. టీడీపీ ఎన్డీయేలో చేరబోతున్నట్లు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అధికారికంగా ప్రకటించాడు. ఇక మిగిలింది సీట్ల కేటాయింపు అంశమే. దీనిపై కూడా త్వరలో విడుదల చేయబోతే రెండో జాబితాతో క్లారిటీ రానుంది. అయితే ఇప్పుడు సిఎం అభ్యర్థి ఎవరనే ప్రశ్నే. సిఎం అభ్యర్థి విషయంలో మొదట చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కూడా గట్టిగానే పోటీ పడ్డారు. కానీ ఆ తరువాత పరిస్థితుల దృష్ట్యా సిఎం రేస్ నుంచి పవన్ తప్పుకున్నట్లు గుసగుసలు వినిపించాయి. అందుకే సీట్ల కేటాయింపులో కూడా పవన్ పెద్దగా డిమాండ్ చేయలేదని తెలుస్తోంది. పైగా ఈసారి పవన్ పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలుస్తాడనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో పవన్ సిఎం రేస్ నుంచి దాదాపు తప్పుకున్నట్లేనని చెప్పవచ్చు. ఇక ఈ విషయంలో బీజేపీ టీడీపీ మద్యనే అసలు ఫైట్ ఉండనున్నట్లు తెలుస్తోంది. టీడీపీతో కలిసినప్పటికి సిఎం అభ్యర్థి బీజేపీ నేతనే ఉండాలని మొదటి నుంచి కూడా కమలనాథులు డిమాండ్ చేస్తున్నారు. 2014 లో బీజేపీకి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వకుండా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మోసం చేశాడని, ఈసారి మాత్రం కూటమిలో బీజేపీదే అగ్రతాంబూలం ఉండాలని కమలనాథులు భావిస్తూ వచ్చారు.
కూటమిలో భాగంగా బీజేపీకి ఆరు అసెంబ్లీ సీట్లు కేటాయించేందుకు చంద్రబాబు నాయుడు ప్లాన్ చేస్తున్నారట. అందువల్ల సీట్ల కేటాయింపు తక్కువగా జరిగినప్పటికి సిఎం అభ్యర్థిని మాత్రం తమ పార్టీ నుంచే ఎన్నుకునే విధంగా కమలం పార్టీ డిమాండ్ చేస్తోంది. మరి బీజేపీ నుంచి వినిపిస్తున్న డిమాండ్ కు చంద్రబాబు ఎంతవరకు అంగీకరిస్తారనేది ప్రశ్నార్థకమే. ఎందుకంటే ఇవే తనకు చివరి ఎన్నికలని చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో చివరి ఎన్నికల్లో సిఎం అభ్యర్థిగా చంద్రబాబే ఉండాలనేది టీడీపీ వైపు నుంచి వినిపిస్తున్న మాట. మరి సిఎం అభ్యర్థి విషయంలో ఎవరు వెనక్కి తగ్గుతారు ? ఎవరు ఎన్నికవుతారు ? అనేది చూడాలి.
Also Read:Rohith:రోహిత్ రిటైర్మెంట్ అప్పుడే!